Domalguda Cylinder Blast: దోమలగూడ సిలిండర్ పేలుడు ఘటనలో.. మరొకరు మృతి..
హైదరాబాద్‌లో దోమలగూడ గ్యాస్ సిలాండర్ పేలుడు ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో ఈ ప్రమాద ఘటనలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.

Domalguda Cylinder Blast
Domalguda Cylinder Blast: హైదరాబాద్‌లో దోమలగూడ గ్యాస్ సిలీండర్ పేలుడు ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో ఈ ప్రమాద ఘటనలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ నెల 10వ తేదీన గ్యాస్ సిలీండర్ లీకై అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. శరణ్య (7) అనే చిన్నారి ఆరోజు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈనెల 14న పద్మ( 53 ), ఆమె కూతురు ధనలక్ష్మి( 28 ), ధనలక్ష్మి కొడుకు అభినవ్ (7) లు మృతి చెందారు. ఆదివారం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగమణి (38) మృతి చెందింది. దీంతో గ్యాస్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
ఇదే ఘటనలో తీవ్ర గాయాలతో ఆనంద్ (41), విహాన్ (4)లు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, వీరి పరిస్థితికూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో బోనాల పండుగ నేపథ్యంలో ఈనెల 10న దోమలగూడలోని ఓ ఇంట్లో పిండి వంటలు తయారు చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలు కాగా.. చికిత్స పొందుతూ ఐదుగురు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుకావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.