Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

హర్యానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పానిపట్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

Cylinder Blast

Updated On : January 12, 2023 / 10:21 AM IST

Cylinder Blast: హర్యానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పానిపట్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పానిపట్‌లోని తహసీల్ క్యాంప్‌లోని రాధా ఫ్యాక్టరీ సమీపంలోని ఓ ఇంటిలో ఈ పేలుడు సంభవించింది. గ్యాస్ సిలీండర్ పేలుడు సమయంలో ఇంట్లో ఉన్న భార్యాభర్తలు, నలుగురు పిల్లలు మంటల్లో సజీవదహనమయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లోనివారు బయటకు వచ్చేందుకు అవకాశంలేకుండా పోయింది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Oxygen Cylinder Blast : బాబోయ్.. బాంబులా పేలిన ఆక్సిజన్ సిలిండర్, ఇద్దరు మృతి

పోలీసులు సహా అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు. గ్యాస్ సిలీండర్ పేలుడు సమయంలో భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. మంటల్లో సజీవదహనం అయినవారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Gas Cylinder Exploded: పెళ్లి వేడుకలో పేలిన సిలిండర్లు.. ఐదుగురు మృతి.. 60మందికి గాయాలు, పలువురి పరిస్థితి విషమం

మృతులల్లో భార్యభర్తలతోపాటు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అబ్దుల్ కరీం (50), అతని భార్య ఆప్రోజా (46), పెద్ద కుమార్తె ఇష్రత్ ఖాతున్ (17), రేష్మా (16), అబ్దుల్ షకూర్ (10), అఫాన్ (7)లుగా గుర్తించారు. అబ్దుల్ కరీం పశ్చిమ బెంగాల్లోని నార్త్ దినాజ్ పూర్ నివాసం. ప్రస్తుతం కుటుంబం బధ్వారామ్ కాలనీ, కేసీ చౌక్‌లో అద్దెఇంట్లో నివాసం ఉంటున్నాడు.