Dharmapuri Strong Room : ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ కీస్ లో మరో ట్విస్ట్.. 17ఏ, 17సీ డాక్యుమెంట్లు భద్రపరిచిన ట్రంక్ పెట్టె కీస్ మాయం
ట్రంక్ పెట్టెల తాళాలను అధికారులు పగులకొట్టారు. ట్రంక్ పెట్టేలా తాళాల కీస్ లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలును అధికారులు పగలగొట్టారు.

Dharmapuri Strong Room
Dharmapuri Strong Room : జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాల కీస్ లలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 17ఏ, 17 సీ డాక్యుమెంట్లు భద్రపరిచిన ట్రంక్ పెట్టె తాళాల కీస్ మాయం అయ్యాయి. 17 ట్రంక్ పెట్టె తాళాల కీస్ లేవని పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్తున్నారు. నాలుగు బాక్సులకు సంబంధించిన తాళాల కీస్ మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు.
ట్రంక్ పెట్టెల తాళాలను అధికారులు పగులకొట్టారు. ట్రంక్ పెట్టేలా తాళాల కీస్ లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలును అధికారులు పగలగొట్టారు. స్ట్రాంగ్ రూమ్ తాళాల కీస్ మిస్ అవ్వడంతో హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తాళాలను అధికారులు పగలగట్టారు.
17ఏ,17 సీ డాక్యుమెంట్లు కీలకం కానున్నాయి. టోటల్ ఓట్లతో పాటుగా పోలైన ఓట్లు, అభ్యర్థులకు వచ్చిన వివరాలన్నీ 17సీ డాక్యుమెంట్లో ఉంటాయి. ఇక 17 ఏ డాక్యుమెంట్ల పోలింగ్ శాతం ఉంటుంది. పోలైన ఓట్లకు.. ప్రకటించిన ఓట్ల మధ్య వ్యత్యాసం ఉందని పిటిషన్ దారుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపణ చేస్తున్నారు.
హైకోర్ట్ ఆదేశాలతో ఎన్నికల అధికారులు డాక్యుమెంట్లు స్కానింగ్ చేసి నివేదిక ఇవ్వనున్నారు. ఎన్నికల అబ్జర్వర్ అవినాష్ కుమార్ స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలను అధికారులు పగులగొట్టారు. ధర్మపురి ఎన్నిక ఫలితం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి కోర్టుకెళ్లారు.