Judge Sujata Car Accident : రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సుజాతకు తీవ్ర గాయాలు.. తన కాన్వాయ్ లో హైదరాబాద్ కు తరలించిన మంత్రి జగదీష్ రెడ్డి

వర్షంలో అదుపుతప్పి న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న కారు పల్టీ కొట్టింది. దీంతో న్యాయమూర్తి సుజాతకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Judge Sujata Car Accident : రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సుజాతకు తీవ్ర గాయాలు.. తన కాన్వాయ్ లో హైదరాబాద్ కు తరలించిన మంత్రి జగదీష్ రెడ్డి

Road accident

Updated On : September 11, 2023 / 8:32 AM IST

AP High Court Judge Sujata Car Accident : సూర్యాపేట జిల్లాలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సుజాత కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో న్యాయమూర్తి సుజాతకు  తీవ్ర గాయాలు అయ్యాయి. మంత్రి జగదీష్ రెడ్డి సమయస్ఫూర్తితో న్యాయమూర్తి సుజాతను మెరుగైన చికిత్స కోసం తన కాన్వాయ్ లో హైదరాబాద్ కు తరలించారు. చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో హైకోర్టు న్యాయమూర్తి సుజాత కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.

వర్షంలో అదుపుతప్పి న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న కారు పల్టీ కొట్టింది. దీంతో న్యాయమూర్తి సుజాతకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను మొదట సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి వెళ్ళారు.

Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్, ఆరుగురు మృతి

మంత్రి జగదీష్ రెడ్డి సమయస్ఫూర్తి ప్రదర్శించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సుజాతను మెరుగైన వైద్యం కోసం తన కాన్వాయ్ లో హైదరాబాద్ కు తరలించారు. తన కాన్వాయ్ మధ్యలో అంబులెన్స్ ద్వారా న్యాయమూర్తి సుజాతను ఆస్పత్రికి తరలించారు. మంత్రి జగదీష్ రెడ్డి హైవే పొడవునా పోలీసులను అలర్ట్ చేశారు.