Asaduddin owaisi: సచివాలయ ప్రారంభోత్సవానికి తప్పకుండా వెళ్తాం.. కానీ..: అసదుద్దీన్

సచివాలయ ప్రారంభోత్సవానికి తప్పకుండా వెళ్తామని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. అయితే, సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభతో మాత్రం తమకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు.

Asaduddin Owaisi: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సమయం సమీపిస్తుండడంతో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ ఆ భవనాన్ని ప్రారంభించి, అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొంటారు. దీనిపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

సచివాలయ ప్రారంభోత్సవానికి తప్పకుండా వెళ్తామని చెప్పారు. కొత్త సచివాలయం హైదరాబాద్ కు తలమానీకమేనని అన్నారు. సచివాలయాన్ని తాజ్ మహల్ కంటే పెద్దగా కట్టారని చెప్పారు. అయితే, సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభతో మాత్రం తమకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 నియోజక వర్గాల్లో తమ పార్టీ పోటీ చేయడంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తమ పార్టీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, బీజేపీకి తమ పార్టీ బీ టీమ్ అంటోందని చెప్పారు. కేంద్రంలో బీజేపీని ఓడించాలని అన్నారు.

అదానీ గ్రూప్ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నా హిండెన్ బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసేందుకు ప్రధాని మోదీ సానుకూలంగా లేరని చెప్పారు. కాగా, కేసీఆర్ జన్మదినోత్సవం నాడే నూతన సచివాలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.

Viral Video: 3 రోజుల పాటు శిథిలాల కింద చిన్నారి.. బయటకు వచ్చాక అంబరాన్నంటే ఆనందం

ట్రెండింగ్ వార్తలు