Barrelakka Sirisha : తగ్గేదేలే.. లోక్‌సభ బరిలో దిగుతున్న బర్రెలక్క

అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ స్ధానం నుండి ఓటమి పాలైన బర్రెలక్క లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈసారి నాగర్ కర్నూలు నుండి పోటీకి దిగుతానని బర్రెలక్క వెల్లడించారు.

Barrelakka Sirisha : తగ్గేదేలే.. లోక్‌సభ బరిలో దిగుతున్న బర్రెలక్క

Barrelakka Sirisha

Updated On : January 21, 2024 / 8:10 PM IST

Barrelakka Sirisha : కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ వేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన బర్రెలక్క లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. నాగర్ కర్నూలు స్ధానం నుండి పోటీ చేస్తానని బర్రెలక్క వెల్లడించారు.

MLC Kavitha: కవిత మళ్లీ నిజామాబాద్ పార్లమెంటు బరిలోకి దిగుతారా? లేదా?

బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. డిగ్రీ చదువుకున్నా బర్రెలు కాసుకుంటున్నా అంటూ ఆమె చేసిన వీడియో అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. ఆ తరవాత ఆమె పేరు కాస్త బర్రెలక్కగా మారిపోయింది. పోటీ పరీక్షలు రాసి విసిగిపోయిన బర్రెలక్క ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని భావించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధి జూపల్లి కృష్ణారావు అక్కడ విజయం సాధించారు. అయితే బర్రెలక్కకు 6000 ఓట్లు దక్కాయి. ఓటమి విషయంలో కాస్త నిరాశపాలైనా తన పట్టుదల మాత్రం వీడలేదు బర్రెలక్క. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వ సలహాదారులను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల్లో బర్రెలక్క నాగర్ కర్నూలు స్ధానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆచితూచి అడుగులు వేస్తానని చెబుతున్నారు. బర్రెలక్కకి సోషల్ మీడియాలో అనేక ఫ్లాట్‌ఫామ్‌లలో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కంచె ఐలయ్య, జేడీ లక్ష్మీ నారాయణ వంటి వారు కూడా బర్రెలక్కకి సపోర్ట్ చేసారు. ఆర్ధికంగా అనేకమంది విరాళాలు ఇచ్చారు. ఉన్నంతలో విస్తృతంగా ప్రచారం చేసిన అయినా ఇవేమీ కొల్లాపూర్ లో పనిచేయలేదు. మరి నాగర్ కర్నూలు బరిలో ఎంపీ అభ్యర్ధిగా గెలవాలంటే అక్కడ నిలబడుతున్న ఇతర పార్టీల అభ్యర్ధులను గట్టిగానే ఢీకొట్టాలి. బర్రెలక్క మరి ఎలాంటి ప్రణాళికతో వెళ్తారో చూడాలి.