ఆ జిల్లాకు బతుకమ్మ చీరల పంపిణీ బ్రేక్.. ఎందుకంటే

తెలంగాణా ఆడపడుచులకు దసరా పండుగ కానుకగా ప్రభుత్వం ఇవ్వాలనుకున్న బతుకమ్మ చీరల పంపిణీ సోమవారం (సెప్టెంబర్ 23, 2019) నుంచి ప్రతి జిల్లాలో జరగనుంది. కానీ సూర్యాపేట జిల్లాలో చెయ్యకపోవటం సూర్యాపేట జిల్లా మహిళలను నిరాశకు గురి చేస్తుంది. ఇందుకు అక్కడి మహిళలు నిరాశ చెందారు. మరి అక్కడ మహిళలకు చీరల పంపిణీ ఎందుకు చేయడం లేదు? అసలు కారణం ఏమిటి?
వివరాలు…సూర్యాపేట మహిళలందరు ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలను ధరించి పండుగ జరుపుకోవాలని ఆశపడ్డారు. కానీ సడెన్ గా వచ్చిన ఎన్నికల కోడ్ వల్ల చీరల పంపినీ నిలిపివేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాతే వాళ్లకు చీరల పంపిణీ ఉంటుంది.
హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో.. ఆ నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలో ఉండటంతో ఆ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అందువల్ల సూర్యాపేట జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీని నిలిచిపోయింది. దీంతో ఎన్నికలు ముగిసిన తర్వాతే వాళ్లకు చీరల పంపిణీ ఉంటుంది.