Temperature Soars : చిల్డ్ బీర్ అంటున్న మందుబాబులు, పెరిగిన అమ్మకాలు

ఏప్రిల్ మొదటివారంలోనే బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఏప్రిల్ 01వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బీర్ల అమ్మకాల్లో పెరుగుదల నమోదవుతోంది. ఏప్రిల్ 01వ తేదీ నుంచి పది వరకు...

Temperature Soars : చిల్డ్ బీర్ అంటున్న మందుబాబులు, పెరిగిన అమ్మకాలు

Beers

Updated On : April 12, 2022 / 8:40 AM IST

Beer Sales In Hyderabad : ఎండలు చురుక్కుమనిపిస్తున్నాయి. ఉదయం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఏప్రిల్ ప్రారంభంలోనే మాడు పగులగొట్టే విధంగా ఎండలు ఉండడంతో భయపడే పరిస్థితి ఎదురవుతోంది. దీంతో మందుబాబులు మందు బాటిల్ ను పక్కన పెట్టేసి.. బీర్ ఎత్తుతున్నారు. ఎండకు ఇదే కరెక్టు అంటూ చిల్డ్ బీర్ ఎత్తుతూ చీర్స్ అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల అమ్మకాలు పెరగడమే ఇందుకు కారణం.

Read More : Heat Wave Alert : రోహిణి కార్తెను మించిన ఎండలు.. మరో మూడు రోజులు మంటలే మంటలు, బయటకు రావొద్దు

ఏప్రిల్ మొదటివారంలోనే బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఏప్రిల్ 01వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బీర్ల అమ్మకాల్లో పెరుగుదల నమోదవుతోంది. ఏప్రిల్ 01వ తేదీ నుంచి పది వరకు బీర్ల సేల్స్ 20 పెరిగాయంటే వీటికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 10 రోజుల్లో 10 లక్షల బీర్లు అమ్ముడు అయినట్లు తెలుస్తోంది. ఇతర రకాల మద్యం అమ్మకాల విషయంలో మాత్రం స్వల్పంగా తగ్గుదల నమోదవుతోంది. 2021 ఏప్రిల్ మొదటి పది రోజుల్లో 6 లక్షల కేసులుగా ఉన్న మద్యం అమ్మకాలు ఈ సంవత్సరం 13 శాతం తగ్గి.. 5.14 లక్షల కేసులుగా నమోదైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మొత్తంగా చూస్తే లిక్కర్ ప్రియులు 90 వేలకు పైగా IML, 74 వేలకు పైగా బీర్ కేసులు లాగేస్తున్నారని అంచనా వేస్తున్నారు.

Read More : Severe Suns : తెలంగాణలో భానుడి భగభగలు, మార్చిలోనే.. మే ఎండలు

ఇక ఎండల విషయానికి వస్తే…రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రోజూ 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. మధ్యాహ్నం అయిందంటే చాలు.. రోడ్లపై జనసంచారం తగ్గిపోతోంది. అయితే.. ఇది శాంపిల్ మాత్రమేనని.. ముందు ముందు ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. గతేడాదితో పోలిస్తే ఈ సారి మార్చి రెండో వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు మరింత పెరిగుతున్నాయి. ప్రధానంగా ఉత్తర భారతలో వీస్తున్న వేడి గాలుల కారణంగా మార్చి రెండో వారంలోనే పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్, మే నెలల్లో వేడి గాలులతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రికార్డ్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయంటున్నారు. క్రమేపీ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు.