Heat Wave Alert : రోహిణి కార్తెను మించిన ఎండలు.. మరో మూడు రోజులు మంటలే మంటలు, బయటకు రావొద్దు

ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవచ్చు. అందుకే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల్లోపే...

Heat Wave Alert : రోహిణి కార్తెను మించిన ఎండలు.. మరో మూడు రోజులు మంటలే మంటలు, బయటకు రావొద్దు

Weather

High Temperature In Telangana : భానుడు నిప్పులుగక్కుతున్నాడు. బయట అడుగుపెడితే .. బాదేస్తున్నాడు. సూర్యుని భగభగలకు .. తెలంగాణ సెగలుగక్కుతోంది. వేడిగాలులు.. ఉక్కపోత.. జనాలకు మంటలు పుట్టిస్తోంది. విపరీతమైన వేడికి ప్రజలు మగ్గిపోతున్నారు. సూర్యుని ప్రతాపంతో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. సాధారణంకంటే మూడు నాలుగు డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతోంది. వీటికి తోడు 2022, ఏప్రిల్ 01వ తేదీ శుక్రవారం నుంచి మరో మూడు రోజుల పాటు తెలంగాణలో .. మంటలే మంటలు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంకా పెరగనున్నాయి. ఏప్రిల్‌లోనే రోహిణీ కార్తెను మించిన ఎండలు దడపుట్టిస్తున్నాయి.

Read More : Weather Update: తగ్గేదేలే అంటున్న సూర్యుడు.. మరో రెండు రోజులు వడగాలులు

ఉదయం 9 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇక ఇవాళ, రేపు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో .. వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువగా 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఉత్తర తెలంగాణలో సాధారణం కన్నా తక్కువగా, దక్షిణ తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువగా.. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని .. విపరీతమైన ఎండ వేడికి హీట్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 105 డిగ్రీల కంటే ఎక్కువగా ఉడటంతో.. కళ్లుతిరిగి పడిపోయే అవకాశం ఉంది.

Read More : Weather forecast : తెలంగాణలో పెరుగుతున్నపగటి ఉష్ణోగ్రతలు

ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవచ్చు. అందుకే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల్లోపే ఇళ్లకు చేరాలంటూ సూచిస్తున్నారు. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి, ఆదిలాబాద్‌ జిల్లా చేప్రాలలో 43.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఉపరితల ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్‌ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు తీవ్రమై గాలిలో తేమ 51 శాతానికి తగ్గిందని చెప్పింది. గాలిలో తేమ శాతం తగ్గడంతో పొడిగాలులు వీస్తున్నాయని వివరించింది. ఈ నెలలో ఎండలు అధికంగానే ఉంటాయని, వానలు అదేస్థాయిలో ఉంటాయంది.

Read More : Weather Report: తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

మరోవైపు….చత్తీస్ ఘడ్ నుండి ఇంటీరియర్ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి శుక్రవారం విదర్భ నుండి తెలంగాణా మీదగా ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి సుమారు 0.9 కిమి ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని కారణంగా రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాలతీ, 2022, ఏప్రిల్ 01వ తేదీ శుక్రవారం నుంచి రాగల 3 రోజులలో తెలంగాణా రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. క్రమంగా 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పలు ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉందన్నారు. (weather warning) శనివారం, ఆదివారాల్లో తెలంగాణా రాష్ట్రంలోని ఉత్తర, వాయువ్య జిల్లాలలో (అదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో) వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.