MLA Attacked Toll Gate Staff : మందమర్రి టోల్ గేట్ సిబ్బందిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. మందమర్రి టోల్ గేట్ సిబ్బందిపై ఆయన దాడి చేశారు. ఈ ఘటన మొత్తం సీసీ టీవీలో రికార్డు అయింది.

MLA ATTACK
MLA Attacked Toll Gate Staff : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. మందమర్రి టోల్ గేట్ సిబ్బందిపై ఆయన దాడి చేశారు. అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బెల్లంపల్లికి వస్తోన్న ఎమ్మెల్యే వాహనాన్ని టోల్ గేట్ దగ్గర సిబ్బంది ఆపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి చేశారు. ఈ ఘటన మొత్తం సీసీ టీవీలో రికార్డు అయింది. వివరాళ్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా మందమర్రిలో గత వారం క్రితం నూతన టోల్ గేట్ ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ నుంచి నిన్న అర్ధరాత్రి బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య వస్తున్న క్రమంలో ఆయన కారును మందమర్రి టోల్ గేట్ వద్ద సిబ్బంది ఆపారు. అయితే ఉత్తరాది నుంచి వచ్చి పని చేస్తున్న సిబ్బంది ఎమ్మెల్యేను గుర్తు పట్టలేదు. దీంతో ఎమ్మెల్యే వాహనమా? వాహనంలో ఉన్నది ఎమ్మెల్యేనా కాదా అని తెలుసుకునేందుకు కారు ఆపారు. లోకల్ సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఎమ్మెల్యే కారును గుర్తు పట్టలేదు. వాహనాన్ని ఆపడంతో కారు దిగిన ఎమ్మెల్యే చిన్నయ్య కోపంతో ఇద్దరు టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేశారు.
టోల్‌గేట్ సిబ్బందిపై దాడి.. ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ రేవతిపై కేసు నమోదు
తన వాహనాన్ని ఆపడంతో ఎమ్మెల్యే చిన్నయ్య అసహనం వ్యక్తం చేసి సిబ్బందిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటిరకు నేషనల్ హైవే అథారిటీ గానీ, టోల్ గేట్ సిబ్బంది గానీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. కాగా, టోల్ గేట్ సిబ్బందిపై ఎమ్మెల్యే చిన్నయ్య చేయి చేసుకున్న విజువల్స్ మాత్రం జిల్లా గ్రూపుల్లో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.