Chekuri Kashaiah : మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య కన్నుమూత..
భద్రాద్రి కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ సీనియర్ నేత చేకూరి కాశయ్య మరణించారు. ఆయన వయసు 85 సంవత్సరాలు.. కొంతకాలంగా అనారోగ్యంతో

Chekuri Kashaiah
Chekuri Kashaiah : భద్రాద్రి కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ సీనియర్ నేత చేకూరి కాశయ్య మరణించారు. ఆయన వయసు 85 సంవత్సరాలు.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చేకూరి కాశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు సంతాపం తెలిపారు. ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడుకు చెందిన చేకూరి నర్సయ్య-భాగ్యమ్మ దంపతులకు జన్మించారు.
నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. అయితే రాజకీయాలపట్ల ఆసక్తి ఉన్న కాశయ్య ఉద్యోగానికి రాజీనామా చేసే రాజకీయాల్లో చేరారు.. కొత్తగూడెం సమితి అధ్యక్షుడిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు.