#BharatJodoYatra: ధింసా, పోతరాజు నృత్యం చేసిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, రుద్రారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన గిరిజనుల సాంప్రదాయ నృత్యం 'ధింసా'లో పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. అంతేగాక, రాహుల్ గాంధీ పోతరాజు నృత్యం చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర గణేశ్‌ గడ్డ, సంగారెడ్డి పట్టణం, హనుమాన్‌ నగర్‌ మీదుగా సాగింది.

#BharatJodoYatra: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, రుద్రారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన గిరిజనుల సాంప్రదాయ నృత్యం ‘ధింసా’లో పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. అంతేగాక, రాహుల్ గాంధీ పోతరాజు నృత్యం చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర గణేశ్‌ గడ్డ, సంగారెడ్డి పట్టణం, హనుమాన్‌ నగర్‌ మీదుగా సాగింది.

ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. నిన్న రాహుల్ గాంధీ గాంధీయన్‌ ఐడియాలజీ కేంద్రం నుంచి, న్యూ బోయిన్‌పల్లి, బాలానగర్‌, సుమిత్రా నగర్‌, మియాపూర్‌, పటాన్‌చెరు మీదుగా కొనసాగిన విషయం తెలిసిందే.

తన భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ రైతులు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు సహా అన్ని రంగాల వారిని కలుస్తూ వారి కష్టాల గురించి తెలుసుకుంటున్నారు. రాహుల్ గాంధీని చూసేందుకు భారీగా ప్రజలు వస్తున్నారు. వారితో రాహుల్ గాంధీ మాట్లాడుతూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. చిన్నారులు కూడా రాహుల్ గాంధీని కలిసి సంబరపడిపోతున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..