Bhatti Vikramarka: ఇప్పుడు నిజస్వరూపాన్ని బయటపెట్టారు: భట్టి విక్రమార్క కామెంట్స్
ఇతర రాజకీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలని ఆ పార్టీలు భావిస్తున్నాయని తెలిపారు.

Bhatti vikramarka
Bhatti Vikramarka – Congress : రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించడానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో కలిసి వెళ్లి సీఎం కేసీఆర్ నిజస్వరూపాన్ని బయటపెట్టారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నల్లగొండ జిల్లాలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్, బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని భట్టి విక్రమార్క తెలిపారు. సమాజానికి ప్రధాని మోదీ అత్యంత ప్రమాదకారిగా మారారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని స్పష్టమైందని చెప్పారు. ఇతర రాజకీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలని ఆ పార్టీలు భావిస్తున్నాయని తెలిపారు.
ఇంతకు ముందు గవర్నర్ తో కలిసి మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు మాత్రం రాజీ పడ్డారని భట్టి విక్రమార్క చెప్పారు. మోదీ, కేసీఆర్ నిరంకుశ నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు. ప్రొఫెసర్ హారగోపాల్ తో పాటు పలువురిపై కుట్రపూరితంగా దేశ ద్రోహం కేసు పెట్టారని తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు మాత్రమే ఉన్నాయని భట్టి విక్రమార్క చెప్పారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలు పెట్టి మూడు నెలలు దాటుతున్నదని తెలిపారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడును, వారి ఆవేదనను మీడియా సాక్షిగా తెలంగాణ సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు.