బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు : అఖిలప్రియ ప్రధాన అనుచరుడు శ్రీను క్రిమినల్ హిస్టరీ

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు : అఖిలప్రియ ప్రధాన అనుచరుడు శ్రీను క్రిమినల్ హిస్టరీ

Updated On : January 8, 2021 / 8:36 PM IST

Bhuma Akhilapriya’s main follower is Madala Srinu Criminal History : బోయిన్‌పల్లి కిడ్నాప్‌ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి అని పోలీసులు చెబుతున్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబం చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ రామ్, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిలను కీలక నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. హఫీజ్‌పేట్‌ భూ వివాదమే కిడ్నాప్ వ్యవహారానికి ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు.

కిడ్నాప్ కేసులో ఏ1 ఉన్న భూమా అఖిలప్రియ ప్రధాన అనుచరుడు మాదల శ్రీను క్రిమినల్ హిస్టరీ 10టీవీ చేతికి చిక్కింది. అఖిలప్రియ ఆర్ధిక, రాజకీయ వ్యవహారాల్లో కీలక అనుచరుడిగా శ్రీను ఉన్నట్లు తేలింది. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ను దగ్గరుండి ప్లాన్ చేశాడు మాడ‌ల‌ శ్రీను. గతంలో ఏవీ సుబ్బారెడ్డి హత్యాయత్నం కేసులోనూ కీలకంగా వ్యవహరించాడు.

ఏవీ సుబ్బారెడ్డి హత్యాయత్నం కేసులో 2 నెలల జైలు శిక్ష అనుభవించాడు. గతేడాది మార్చి 21న సుపారీ గ్యాంగులతో ఏవీ సుబ్బారెడ్డి హ‌త్యకు ప్లాన్ చేసిన శ్రీను…కారులో రవిచంద్రారెడ్డి, రామిరెడ్డిలను ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వద్ద దించాడు. ఇక సుబ్బారెడ్డి హత్యాయ‌త్నం త‌ర్వాత మ‌రోసారి వెలుగులోకి వచ్చాడు శ్రీను. 10 నెలల తర్వాత కిడ్నాప్‌ ముఠా లీడర్‌గా శ్రీను పోలీసుల‌కు చిక్కాడు. జ‌ల్సాలు, హెలికాప్టర్ల టూర్లకు శ్రీ‌నుకు వ‌చ్చిన డ‌బ్బుల‌పైనా ఆరా తీస్తున్నారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ ముఠా నాయకుడు శ్రీనుగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్‌లో గుంటూరుకు చెందిన మాడాల శ్రీను కీలకంగా వ్యవహరించాడు. భూమా అఖిలప్రియ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా శీనుకు పేరుంది. నంద్యాల ఉపఎన్నికల్లోనూ అతడు కీలకంగా వ్యవహరించాడు. శ్రీను లగ్జరీ జీవితానికి సంబంధించిన వీడియో టెన్‌ టీవీ చేతికి చిక్కింది.

హెలికాప్టర్లలో సరదాలు.. విలాసవంతమైన జీవితాన్ని శ్రీను గడిపేవాడు. బోయిన్ పల్లి కిడ్నాప్‌ ప్లాన్, రెక్కీ అంతా శీను కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. శ్రీనగర్ కాలనీలో ఐటీ అధికారుల డ్రెస్‌లను అద్దెకు శ్రీను తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్గవరామ్‌కు రైట్‌హ్యాండ్‌గా ఉంటున్న శీను.. గత చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.