Shameerpet Gun Firing : ఆ మనోజ్ నేను కాదు- శామీర్‌పేట్ కాల్పుల కేసులో మరో బిగ్ ట్విస్ట్, వీడియో రిలీజ్ చేసిన నటుడు

Shameerpet Gun Firing : నేను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాను. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఎవరూ నమ్మొద్దు.

Shameerpet Gun Firing : ఆ మనోజ్ నేను కాదు- శామీర్‌పేట్ కాల్పుల కేసులో మరో బిగ్ ట్విస్ట్, వీడియో రిలీజ్ చేసిన నటుడు

Shameerpet Gun Firing-Manoj

Updated On : July 15, 2023 / 10:53 PM IST

Shameerpet Gun Firing – Actor Manoj : హైదరాబాద్ లో సంచలనం రేపిన శామీర్ పేట్ కాల్పుల ఘటనలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న మనోజ్-స్మితల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు అంతకుమించి ట్విస్ట్ బయటపడింది. సీరియల్ నటుడు మనోజ్ తెరమీదకు వచ్చారు. కాల్పుల కేసులో తన పేరు, ఫొటోలు మీడియాలో రావడంపై మనోజ్ స్పందించారు.

కాల్పుల కేసులో పోలీసుల అదుపులో ఉన్న మనోజ్ నాయుడు తాను ఒక్కటి కాదని క్లారిటీ ఇచ్చారు. ఆ మనోజ్ వేరు నేను వేరు అని చెప్పారు. పొరపాటున మీడియాలో తన ఫొటోలను చూపిస్తున్నారని మనోజ్ వాపోయారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటుడు మనోజ్ తేల్చి చెప్పారు. ఈ మేరకు టీవీ నటుడు మనోజ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంతో పోలీసుల అదుపులో ఉన్న మనోజ్ ఎవరు? అనేది తేలాల్సి ఉంది.

Also Read..Shameerpet Gun Firing : శామీర్‌పేట్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి నటుడు మనోజ్, స్మిత మోసాలు.. అందమైన అమ్మాయిలే టార్గెట్

”కాల్పుల కేసుతో నాకు సంబంధం లేదు. ఆ మనోజ్ నాయుడు వేరు నేను వేరు. పొరపాటున నా ఫొటోలు చూపిస్తున్నారు. నేను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాను. కొంతమంది నా ఫొటోస్, వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఎవరూ నమ్మొద్దు” అని టీవీ నటుడు మనోజ్ వీడియోలో రిక్వెస్ట్ చేశారు.

శామీర్ పేట్ లో కాల్పలు కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కొత్త కోణం బయటపడింది. మనోజ్, స్మితల ఘరానా మోసాలు బయటకు వచ్చాయి. ఈ ఇద్దరు మహా ముదుర్లు అని పోలీసుల విచారణలో తేలింది. సినిమాల్లో ఛాన్సుల పేరుతో అందమైన, డబ్బున్న అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు దండుకున్నట్లు గుర్తించారు.

Also Read..CP CV Anand : కేబీఆర్ పార్క్ చుట్టూ 264 సీసీ కెమెరాలు.. 15 నిమిషాల్లో నేరం చేసిన వ్యక్తిని గుర్తిస్తున్నాం : సీపీ సీవీ ఆనంద్

అందమైన అమ్మాయిలను ట్రాప్ చేయడం, సినిమాల్లో అవకాశాల పేరుతో మోసం చేయడం.. ఇదీ మనోజ్, స్మితల తీరు. ఇటీవలే విజయవాడకు చెందిన ఓ సంపన్న కుటుంబం యువతికి ఈ కంత్రీ జంట వల వేసింది. ఆ ఫ్యామిలీని బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేసింది మనోజ్-స్మిత జంట.
స్మిత ఒరాకిల్ ఉద్యోగినిగా పని చేస్తూనే మోసాలకు తెరలేపింది. కాల్స్ చేసి ట్రాప్ చేయడం, మెయిల్స్ హ్యాక్ చేయడం.. ఇదీ వీరి తంతు. స్మిత-మనోజ్ అక్రమాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.