50 Lawyers For Pallavi Prashanth Case
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు 14 రిమాండ్ విధించడంతో పోలీసులు ప్రశాంత్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. బెయిల్ కోసం పల్లవి ప్రశాంత్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పును వాయిదా వేసింది. కోర్టు విచారణ అనంతరం లాయర్లు మీడియాతో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
”సామాన్యుడి కోసం సామాన్య న్యాయవాదులుగా ఆర్గుమెంట్ చేశాం. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాదనలు వినిపించాము. ఒక రైతు బిడ్డ కష్టపడి చిన్న చిన్న వీడియోలు చేస్తూ పల్లెలో ఉంటూ సోషల్ మీడియాలో హీరో ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ వ్యక్తి కళను గుర్తించి నాగార్జున బిగ్ బాస్ లో అవకాశం ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో చిన్న చిన్నగా ముందుకు సాగాడు. అందరి సపోర్టుతో విజేత అయ్యాడు.
అలాంటి వ్యక్తిని.. క్రైమ్ చేయకున్నా నేరం చేశాడని ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. సమాచారం ఇవ్వకుండానే అరెస్ట్ చేశారు. ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ చేశారు. నేరం చేయని వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? ఏ విధంగా రిమాండ్ చేస్తారు? ఏ విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు? అనే కోణంలో బెయిల్ పిటిషన్ లో ఆర్గుమెంట్ చేశాము. జడ్జి సానుకూలంగా స్పందించారు. రేపు ఆలోచన చేస్తామన్నారు. ఉత్తర్వులు సానుకూలంగా వస్తాయని ఆశిస్తున్నాం” అని న్యాయవాది చెప్పారు.
Also Read : బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసు.. పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
”పీపీ 353 సెక్షన్ ప్రశాంత్ కు వర్తిస్తుందన్నారు. దాని ప్రకారం బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలన్నారు. దానికి కౌంటర్ గా 353 అన్నది రెండేళ్లలోపు ఉన్న నేరం. గొడవ జరిగిన సమయంలో పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు అక్కడ లేరు. వారిద్దరూ అక్కడ లేనప్పుడు వారికి ఆ సెక్షన్ వర్తించదని ఆర్గుమెంట్ చేశాం. దానికి జడ్జి సానుకూలంగా స్పందించారు” అని ప్రశాంత్ తరపున వాదనలు వినిపించిన లాయర్ వెల్లడించారు.
”ఎంత మంది జనం ఉన్నా పోలీసులు కో ఆర్డినేషన్ చేసుకుని అందరిని అక్కడి నుంచి పంపేయాలి. అది పోలీసుల బాధ్యత. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే కేసు పెట్టడం విడ్డూరం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, ఐపీసీ చట్టాలు పోలీసులు చదవాలి. మేము న్యాయవాదులం కాబట్టి న్యాయవ్యవస్థ మీద నమ్మకంతో పోరాటం చేస్తాం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన, అభంశుభం తెలియని పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం దారుణం. వీవీఐపీల విషయంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారా? ఇప్పటికైనా పోలీసులు కేసుని వెనక్కి తీసుకోవాలి” అని మరో అడ్వొకేట్ అన్నారు.
Also Read : అందుకే రైతుబిడ్డకి ప్రైజ్ ఇచ్చారు.. ఇదంతా నాటకం.. బిగ్‌బాస్ పై మరోసారి సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
”ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 50మంది లాయర్లు పల్లవి ప్రశాంత్ కోసం న్యాయ పోరాటం చేశారు. లాయర్లు అందరూ మూకుమ్మడిగా జడ్జి దగ్గర డిఫెండ్ చేశారు. జడ్డి చాలా సానుకూలంగా స్పందించారు. ప్రశాంత్ కు రేపు 100శాతం బెయిల్ ఇచ్చే అవకాశం నాకు కనపడింది. వినోద్, లక్ష్మణ్, సీను, వేణు లాయర్లు అందరికీ ధన్యవాదాలు. ఒక వ్యక్తి గురించి ఇంతమంది లాయర్లు డిఫెండ్ చేయడం అదృష్టంగా భావించాలి. ప్రజల కోరిక మేరకే ప్రశాంత్ త్వరలో బయటకు రాబోతున్నాడు.
నేను దాడులను సమర్థించను. ఎవరైనా ఒక సెలెబ్రిటీ వస్తున్నాడు అంటే అక్కడ కచ్చితంగా జన సందోహం ఉంటుంది. అది కామన్. అందులో రకరకాల సమస్యలు ఉంటాయి. ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది అల్లరిమూకలు ఉంటారు. వాళ్లు ఏదో ఒక డిస్ట్రబ్ చేస్తారు. వాళ్లను ఎలా కంట్రోల్ చేయాలన్నది పోలీసులు చూడాలి. అది వాళ్లకు సంబంధించినది.
Also Read : నాంప్లలి కోర్టులో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు షాక్.. మరో 16 మంది అరెస్ట్
పల్లవి ప్రశాంత్ ఎందుకు జైలుకి వెళ్లాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. నాకు సెక్షన్ల గురించి తెలియదు. ప్రశాంత్ చాలా సింపుల్ గా బయటకు వచ్చే అవకాశం ఉంది. అతడి మీద ఎలాంటి కేసులు లేవు. మట్టి బిడ్డగా వచ్చి పట్టుదలతో గెలిచి బిగ్ బాస్ లో మంచి పేరు సంపాదించాడు. అందరికీ ఆదర్శంగా నిలిచాడు. గొప్ప వ్యక్తి. అతడి గుణం నాకు తెలుసు. జనం గురించి తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డాడు” అని బిగ్ బాస్ కంటెస్టెంట్ బోలే అన్నారు.