నాంప్లలి కోర్టులో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు షాక్.. మరో 16 మంది అరెస్ట్
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ప్రశాంత్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. జైల్లో రిమాండ్ ఖైదీ ఉన్నాడు ప్రశాంత్.

Bigg Boss Winner Pallavi Prashanth
Pallavi Prashanth : బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ పూర్తైంది. తీర్పును రేపటికి(డిసెంబర్ 22) వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని ప్రశాంత్ తరపు న్యాయవాది జులకంటి వేణుగోపాల్ కోరారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు జరిగాయన్నారు. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ కు బయట జరిగిన ఉదంతం తెలియదని కోర్టుకు తెలిపారు న్యాయవాది వేణుగోపాల్.
బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తవగా.. తీర్పును రేపటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ప్రశాంత్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ప్రశాంత్.
ప్రభుత్వ ఆస్తులపై దాడి కేసులో అరెస్ట్ అయిన పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించగా.. తాజాగా ఇదే కేసులో మరో 16మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు మైనర్లు ఉన్నారు. మిగిలిన 12మందిని వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచనున్నారు.
బిగ్ బాస్ ఫైనల్ తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు విధ్వంసానికి దిగారని పోలీసులు చెబుతున్నారు. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడ్డారని, వాహనాలు ధ్వంసం చేశారని కేసులు నమోదు చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో ఉన్నారు. తాజాగా 16 మందిని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
వీడియోలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తిస్తున్నారు పోలీసులు. బిగ్ బాస్ ఫైనల్ తర్వాత పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పల్లవి ప్రశాంత్ ర్యాలీగా వెళ్లాడని, రోడ్డుపై వాహనాలు ఆపాడని, దాంతో అభిమానులు రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసులు కేసులు పెట్టారు.
Also Read : అందుకే రైతుబిడ్డకి ప్రైజ్ ఇచ్చారు.. ఇదంతా నాటకం.. బిగ్‌బాస్ పై మరోసారి సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
అక్రమంగా కేసు నమోదు చేశారు- లక్ష్మణ్, అడ్వకేట్
ఈ కేసుపై అడ్వొకేట్ లక్ష్మణ్ మాట్లాడారు. ”పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ చేయాలి. కానీ అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. నేరం చేయని వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు. FIR కాపీ ఇవ్వమని అడిగితే కూడా జూబ్లీహిల్స్ పోలీసులు ఇవ్వలేదు. బెయిల్ పిటిషన్ పై జడ్జి సానుకూలంగా స్పందించారు. రేపు బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇస్తామని చెప్పారు”
అల్లర్లకు, ప్రశాంత్ కు సంబంధం లేదు-బోలె, బిగ్‌బాస్ కంటెస్టెంట్
రేపు ప్రశాంత్ కి తప్పకుండా బెయిల్ వచ్చే అవకాశాలున్నాయి. అడ్వకేట్స్ సరిగా డిఫెండ్ చేశారు. ఎవరో అల్లరిమూకలు చేసిన అల్లర్లకు పల్లవి ప్రశాంత్ కి సంబంధం లేదు. పల్లవి ప్రశాంత్ తరపున ఏదైనా తప్పు జరిగితే నేను క్షమాపణ చెబుతున్నా అని బోలె అన్నారు.