Munugode bypoll: మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డిని అధికారికంగా ప్రకటించిన బీజేపీ

తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని ఇవాళ అధికారికంగా ప్రకటించింది బీజేపీ. రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు నిన్నటి నుంచే నామినేషన్లు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ఆయా పార్టీల ఇన్ చార్జిలు ఈ అసెంబ్లీ నియోజక వర్గానికి చేరుకున్నారు.

Rajagopalreddy

Munugode bypoll: తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని ఇవాళ అధికారికంగా ప్రకటించింది బీజేపీ. రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు నిన్నటి నుంచే నామినేషన్లు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ఆయా పార్టీల ఇన్ చార్జిలు ఈ అసెంబ్లీ నియోజక వర్గానికి చేరుకున్నారు.

ఇప్పటికే అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ నెల 14న కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అన్ని గ్రామాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోడ్ షోలకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు వేసుకుంటోంది. అలాగే, టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ కు వామపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి ఇనా చార్జిలను పంపుతోంది టీఆర్ఎస్. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులపై స్పష్టత రావటంతో ప్రచారంలో జోరు పెరిగింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..