అభ్యర్థి మృతి.. డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించిన బీజేపీ.. ఉద్రిక్తత
లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
- మక్తల్‌లో బీజేపీ 6వ వార్డు అభ్యర్థి ఆత్మహత్య
- మండిపడుతున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు
- డీజీపీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసుల భద్రత
BJP: నారాయణపేట జిల్లా మక్తల్‌లో బీజేపీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్‌లోని డీజీపీ ఆఫీస్‌ను ముట్టించారు.
లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహదేవప్ప ఆత్మహత్యకు మంత్రి వాకిటి శ్రీహరి కారణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేట్ ముందు బైఠాయించిన నిరసన తెలిపుతున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: మక్తల్ మున్సిపాలిటీలో కలకలం.. 6వ వార్డ్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..
మరోవైపు, దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ.. మహదేవప్పది ఆత్మహత్య కాదు. కాంగ్రెస్ చేసిన హత్య అని అన్నారు. ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారని చెప్పారు.
తమ సహనాన్ని పిరికితనంగా భావిస్తారా? అని అన్నారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పై యుద్ధం చేయబోతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్తాపితం చేసే రోజులొచ్చాయని అన్నారు.
