New Covid Variant JN 1 (Photo : Google)
జేఎన్ 1 వేరియంట్ పై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ సూచించారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్ళు ఇంటికే పరిమితం కావాలన్నారు. అయితే, కరోనా కొత్త వేరియంట్ పై ఆందోళన అవసరం లేదన్న ఆయన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని స్పష్టం చేశారు. గుంపుల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని బూర నర్సయ్య గౌడ్ సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్త వేరియంట్ ను తట్టుకునే శక్తి ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్స్ ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
పార్లమెంటులో కలర్ స్ప్రే ఘటన వెనుక కుట్ర కోణముందని ఆయన ఆరోపించారు. మోదీ ప్రభుత్వాన్ని చులకన చేయటానికి కొందరు ప్రయత్నం చేశారని అన్నారు. నిజాలు బయటకు రాకూడదనే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో రభస చేస్తోందని బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. పాత్రధారులు, కుట్రధారులు ఎవరనేది త్వరలో తెలుస్తుందన్నారాయన. దర్యాప్తు సంస్థలకు ప్రతిపక్షాలు సమయం ఇవ్వాలన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనలు సరైనవి కాదన్నారు.
Also Read : పచ్చి మిరపకాయ ప్రమాదక వ్యాధుల నుండి కాపాడుతుందని మీకు తెలుసా?
కరోనా కొత్త వేరియంట్ JN-1 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కొత్త వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. సింగపూర్ లో కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్ లోనూ అదే రీతిలో ప్రబలుతుండటం కంగారు పెడుతోంది. ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో ఐదుగురు మరణించారు. మరోవైపు కేరళలో గడిచిన 24 గంటల్లో 127 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు సరిపడా ఆర్టీ పీసీఎస్ కిట్లు పంపిణీ చేసి, అనుమానితులకు టెస్టు చేయాలని సూచించింది.
కరోనా కొత్త వేరియంట్ JN-1 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కొత్త వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. సింగపూర్ లో కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్ లోనూ అదే రీతిలో ప్రబలుతుండటం కంగారు పెడుతోంది. ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో ఐదుగురు మరణించారు. మరోవైపు కేరళలో గడిచిన 24 గంటల్లో 127 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు సరిపడా ఆర్టీ పీసీఆర్ కిట్లు పంపిణీ చేసి, అనుమానితులకు టెస్టులు చేయాలని సూచించింది.
కేరళలో తొలి కేసు నమోదు..
దేశంలోనే తొలిసారి కేరళలో కరోనా సబ్ వేరియంట్ JN.1 బయటపడింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో అమెరికాలో మొదట దీన్ని గుర్తించారు. 38కి పైగా దేశాలకు ఈ వేరియంట్ విస్తరించింది. దీని వల్లే మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు తెలిపారు. ఇక, ఇది సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు, తల, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని, మనిషి రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని హెచ్చరించారు.
Also Read : 10 ఏళ్లకే రుతుస్రావం ప్రారంభమైన 65 ఏళ్ల లోపు మహిళల్లో డయాబెటీస్, స్ట్రోక్ ప్రమాదం?
వారికి మాస్క్ మస్ట్..
దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు, మరణాలు వెలుగు చూస్తుండటంతో కర్నాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. 60ఏళ్లు పైబడిన వారికి దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే కచ్చితంగా మాస్క్ ధరించాలని ఆదేశించింది. కేరళ సరిహద్దు జిల్లాల్లో పర్యవేక్షణ పెంచాలని, ఆసుపత్రుల్లో కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాలు ఇచ్చారు.
24 గంటల్లో 335 కరోనా కేసులు, 5 మరణాలు..
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 335 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. కొత్తగా 5 మరణాలు సంభవించాయి. ఇందులో 4 మరణాలు కేరళలోనే నమోదు కాగా, ఉత్తరప్రదేశ్ లో ఒకరు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,701గా ఉంది. ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 5లక్షల 33వేల 317గా ఉంది.
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. కోట్లాది మందిపై ప్రభావం చూపింది. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఆ తర్వాత మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే, కరోనా తగ్గుముఖం పట్టింది ఇక భయం లేదు అని అనుకున్న ప్రతిసారీ కొత్త వేరియంట్లు కలవర పెడుతున్నాయి. చైనాలో వ్యాప్తి చెందుతున్న JN.1 సబ్ వేరియంట్ కేరళలో తొలిసారి బయటపడింది. దీన్ని పిరోలా/BA.2.86 అని కూడా పిలుస్తున్నారు.
JN.1 వేరియంట్ లక్షణాలు..
దగ్గు
తేలికపాటి జ్వరం
గొంతు మంట
ముఖం మీద నొప్పి
కారుతున్న ముక్కు
జీర్ణశయాంతర సమస్యలు
తల నొప్పి
నాసికా మార్గంలో అసౌకర్యం