BMJ Study : 10 ఏళ్లకే రుతుస్రావం ప్రారంభమైన 65 ఏళ్ల లోపు మహిళల్లో డయాబెటీస్, స్ట్రోక్ ప్రమాదం?

10 సంవత్సరాలకే పీరియడ్స్ ప్రారంభం అవడం వల్ల 65 ఏళ్ల లోపున్న మహిళల్లో పక్షవాతం, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. తాజా పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

BMJ Study : 10 ఏళ్లకే రుతుస్రావం ప్రారంభమైన 65 ఏళ్ల లోపు మహిళల్లో డయాబెటీస్, స్ట్రోక్  ప్రమాదం?

BMJ Study

Updated On : December 7, 2023 / 3:50 PM IST

BMJ Study : 13 ఏళ్లు నిండక ముందే రుతుస్రావం ప్రారంభవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందట. యూఎస్ పరిశోధనలో ఈ విషయం తేలినట్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ) న్యూట్రిషన్ ప్రివెన్షన్ & హెల్త్‌లో ప్రచురించారు.

Lifestyle Habits : మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 4 సాధారణ జీవనశైలి అలవాట్లు ఇవే?

10 సంవత్సరాల కంటే ముందు పీరియడ్స్ రావడం వల్ల 65 ఏళ్ల లోపున్న మహిళల్లో పక్షవాతం, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. పరిశోధకులు 20 నుండి 65 ఏళ్ల మధ్య వయసున్న 17,000 మంది మహిళల డేటాను విశ్లేషించిన తరువాత ఈ విషయాన్ని కనుగొన్నారు. యుఎస్‌లోని టులేన్ విశ్వవిద్యాలయం మరియు బ్రిగ్ హామ్, ఉమెన్స్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు పరిశీలనాత్మక అధ్యయనం చేశారు. అయితే అందుకు గల సరైన కారణాలను స్పష్టంగా చెప్పలేకపోయారు.

అధ్యయనంలో పాల్గొన్న మహిళలు తమ మొదటి రుతుచక్రం కలిగిన వయసును నిర్దేశించారు. వీరిలో 10 శాతం మంది టైప్ 2 డయాబెటీస్‌తో ఇబ్బంది పడుటున్నట్లు నివేదించారు. 11.5 శాతం మంది గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లు చెప్పారు. ప్రత్యేకించి 11 ఏళ్ల వయసులో రుతుస్రావం ప్రారంభమైన వారు 81 శాతం, 12 సంవత్సరాల వయసులో 32 శాతం, 14 సంవత్సరాల వయసులో 15 శాతం మంది ఈ పరిశోధనలో ఉన్నట్లు లెక్కించారు.

Healthy Lifestyle : ఆరోగ్యకరమైన జీవనశైలితోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం! సంపూర్ణ ఆరోగ్యం కోసం రోజువారిగా..

స్త్రీలలో రుతుస్రావం ప్రారంభమైన సమయంలో ఈస్ట్రోజన్ స్ధాయిలు అధికంగా ఉండటం కూడా ఈ విషయాన్ని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మరో కారణం బరువు కూడా కావచ్చునని వారు చెప్పారు.  మొదటి పీరియడ్ ప్రారంభమైన వయసుని బట్టి మధుమేహం, మధుమేహ సంబంధ వ్యాధులను ముందుగానే కనిపెట్టి నివారణ మార్గాలను వెతికేందుకు ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెప్పారు.