Healthy Lifestyle : ఆరోగ్యకరమైన జీవనశైలితోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం! సంపూర్ణ ఆరోగ్యం కోసం రోజువారిగా..

పోషకాహారం లోపం వల్ల మూత్రపిండ వ్యాధి, లాక్టోస్ అసహనం, ఉదరకుహర వ్యాధి వంటివి వస్తాయి. ఇవే కాక సరిగ్గా లేని లైఫ్‌స్టైల్, నిద్రసరిగ్గా పోకపోవడం, గుండె జబ్బులకి కారణమవుతాయి. ఈ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి.

Healthy Lifestyle : ఆరోగ్యకరమైన జీవనశైలితోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం! సంపూర్ణ ఆరోగ్యం కోసం రోజువారిగా..

healthy lifestyle

Healthy Lifestyle : ఆరోగ్యకరమైన జీవనశైలే మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆరోగ్యానికి రోజులో ఏం తింటారనేది చాలా ముఖ్యమైంది. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఆ రోజు మనం తీసుకునే తొలి ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో శరీరానికి శక్తిని అందించే పదార్థాలకు అధిక ప్రాధాన్యమివ్వాలి. పండ్లు, నట్స్‌ వంటివి తీసుకోవాలి. రోజూ ఉదయాన్నే ఏదైనా ఒక పండు లేదంటే , నానబెట్టిన కొన్ని బాదం పప్పులు,కిస్‌మిస్‌లను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం అలవాటుగా మార్చుకుంటే రోజూ యాక్టివ్‌గా ఉండటంతోపాటు ఆరోగ్యానికీ ఎంతో మంచిది. తాజా పదార్థాలు, పండ్లు, పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. తృణధాన్యాల ఉత్పత్తులు, అలాగే రోజుకి 10 నుండి 12 గ్లాసుల నీరు త్రాగడం కూడా ఆరోగ్యానికి మంచిది.

పోషకాహారం తీసుకోవడం, కంటి నిండా నిద్ర పోవడం, శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి వ్యాయామాన్ని రొటీన్‌లో భాగం చేసుకోవాలి. పాల ఉత్పత్తులను తీసుకుంటే తక్కువ కొవ్వు, స్కిమ్డ్ రకాలను ఎంచుకోండి. మీ సమయం ఎక్కువ తీసుకున్నా సరే ఆహారాన్ని పూర్తిగా నమిలి తినాలి. బయటి ఫుడ్ కంటే ఇంట్లో వండిన భోజనం తినడం మంచిది. మీకు మీరే వంట చేసుకోండి. బయట తినడం తగ్గించండి. ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ కోసం, మంచి నిద్ర, రక్తాన్ని పెంచడానికి, శరీరం సరిగ్గా పనిచేయడానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. 30 నుంచి 40 నిమిషాలు నడవడం, యోగా సెషన్, జిమ్, వాకింగ్ అనేవి మీ మానసిక స్థితిని పెంచుతాయి. ఇది నిరాశ, ఆందోళన, యాంక్జైటీ భావాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మిమ్మల్ని మరింత చురుగ్గా చేస్తాయి. అనేక సమస్యల నుండి రక్షిస్తాయి.

పోషకాహారం లోపం వల్ల మూత్రపిండ వ్యాధి, లాక్టోస్ అసహనం, ఉదరకుహర వ్యాధి వంటివి వస్తాయి. ఇవే కాక సరిగ్గా లేని లైఫ్‌స్టైల్, నిద్రసరిగ్గా పోకపోవడం, గుండె జబ్బులకి కారణమవుతాయి. ఈ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు చేయించుకుని శరీరంలో వస్తున్న మార్పుల గురించి తెలుసుకోవాలి. బరువుతో సంబంధం లేకుండా సంపూర్ణ ఆరోగ్యానికి మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం కూడా అంతే ముఖ్యం. కాబట్టి వారానికి మూడు గంటల చొప్పున రోజుకు అరగంట పాటు వ్యాయామానికి కేటాయించాలి.

బార్లీ, బ్రౌన్ రైస్, బుక్వీట్, మిల్లెట్, ఓట్మీల్, పాప్‌కార్న్, గోధుమపిండి, బ్రెడ్, క్రాకర్లు మీ ఆహారంలో తృణధాన్యాలను చేర్చడానికి కొన్ని మార్గాలు. మిల్లెట్స్ పోషకాహారంలో పుష్కలంగా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండెజబ్బులు, షుగర్, క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే సంక్లిష్ట పిండి పదార్థాలు ఫైబర్ ఫుడ్‌లో ఉంటాయి. నిపుణుల సూచనలను పాటిస్తే శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.