Raja Singh : అదే నిజమైతే.. నోటీసులు కాదు.. నన్ను సస్పెండ్‌ చేయండి : ఎమ్మెల్యే రాజాసింగ్‌

Raja Singh : తనకు బీజేపీ అధిష్టానం నోటీసులు ఇవ్వబోతుందనే వార్తలపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు.

Raja Singh : అదే నిజమైతే.. నోటీసులు కాదు.. నన్ను సస్పెండ్‌ చేయండి : ఎమ్మెల్యే రాజాసింగ్‌

Raja Singh

Updated On : June 2, 2025 / 9:51 PM IST

Raja Singh : బీజేపీ పార్టీ అధిష్టానం నోటీసులు ఇవ్వనుందనే వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పందించారు. ఒకవేళ అదే నిజమైతే.. ముందు నోటీసులు కాదు.. ఏకంగా నన్ను సస్పెండ్ చేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also :  Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు.. నోటీసులు ఇచ్చే ఛాన్స్..!

అంతేకాదు.. ఒకవేళ తనను సస్పెండ్ చేస్తే అందరి జాతకం బయటపెడతానని అన్నారు. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందనే నిజం చెప్పి మరి అందరి జాతకం ప్రజల ముందు పెట్టి మరి వెళ్తానంటూ వ్యాఖ్యానించారు.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా :
గతకొంత కాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ అసంతృప్తి రాగాన్ని వినిపిస్తున్నారు. ఇటీవలే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్‌ షాపుకు కూడా ఆయన దూరంగానే ఉన్నారు.

గత కొన్నాళ్లుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్‌ అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ నేతలతో కార్యక్రమాల్లో కూడా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తనకు పార్టీ అధిష్టానం నోటీసులు ఇవ్వబోతుందనే వార్త మీడియాలో వచ్చింది.

వార్తలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ.. ‘మీడియాలో ఒక వార్త నడుస్తుంది. రాజాసింగ్‌కు నోటీస్‌ ఇచ్చేందుకు పార్టీ ప్లాన్‌ చేస్తోందని.. అదే నిజమైతే.. నోటీసులు ఇవ్వడం కాదు.. ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి.

Read Also : Nara Lokesh : జగన్‌కు మంత్రి లోకేష్ ఓపెన్ ఛాలెంజ్.. నాపై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు రెడీ..!

కొందరితో కలిసి పార్టీని స్ట్రాంగ్ చేయలేమన్నారు. ధర్మ కార్యక్రమాలు చెయ్యలేమని, గవర్నమెంట్ తీసుకొని రాలేమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.