ఉత్తమ్, శ్రీధర్ బాబుతో బీజేపీ ఎంపీ, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ భేటీ

చేనేత, విద్యకు సంబంధించిన విషయాలపై చర్చించడానికి మంత్రి శ్రీధర్ బాబు సమయం ఇవ్వాలని విజయేంద్ర ప్రసాద్ కోరారు.

ఉత్తమ్, శ్రీధర్ బాబుతో బీజేపీ ఎంపీ, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ భేటీ

Vijayendra Prasad

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో బీజేపీ ఎంపీ, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సమావేశమయ్యారు. చేనేత, విద్యకు సంబంధించిన విషయాలపై చర్చించడానికి మంత్రి శ్రీధర్ బాబు సమయం ఇవ్వాలని విజయేంద్ర ప్రసాద్ కోరారు.

చేనేతను పరిశ్రమల శాఖకు లింక్ చేసే విషయంలో చర్చిస్తానన్నారు. అయితే, తాను అమెరికా వెళ్తున్నానని, వచ్చాక సమయం ఇస్తానని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.

 Vijayendra Prasad

Vijayendra Prasad

మరోవైపు, ఇవాళ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసినా సీట్లు రావట్లేదనే అక్కసుతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు తమ పనితీరే సమాధానం చెబుతుందని తెలిపారు.

మార్పుకు అడ్డు వస్తే సహించేది లేదని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను తాము చేయబోమని తెలిపారు. తమ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామికంగా ఉందని చెప్పారు. ప్రజలకు ఇస్తున్న పథకాలను కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పక్కతోవ పట్టిస్తున్నారని చెప్పారు.

బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయి: ఉత్తమ్ కుమార్ రెడ్డి