Black Fungus Medicines : బ్లాక్ ఫంగస్‌కు మందులు కావాలా? DMEకి మెయిల్‌ చేయండి : కేటీఆర్

తెలంగాణ రాష్ట్రాన్ని బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనాకు తోడు ఈ బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నామని ఊపిరిపీల్చుకునే లోపే ఈ బ్లాక్ ఫంగస్ బాధితులపై దాడి చేస్తోంది.

Black Fungus Medicines : బ్లాక్ ఫంగస్‌కు మందులు కావాలా? DMEకి మెయిల్‌ చేయండి : కేటీఆర్

Black Fungus Victims Can Get Medicines Through Dme Mail, Ktr Tweet (1)

Updated On : May 20, 2021 / 10:23 AM IST

Black Fungus Medicines : తెలంగాణ రాష్ట్రాన్ని బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనాకు తోడు ఈ బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నామని ఊపిరిపీల్చుకునే లోపే ఈ బ్లాక్ ఫంగస్ బాధితులపై దాడి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏపీ, తెలంగాణలో కూడా కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా చికిత్సలో వాడే స్టెరాయిడ్ల వల్ల బ్లాక్ ఫంగస్ సోకుతోంది.

ఆక్సీజన్ పెట్టేటప్పుడు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ వ్యాధి సోకుతున్నట్టు కనిపిస్తోంది. బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బ్లాక్ ఫంగస్ చికిత్సకు సంబంధించి మందులకు భారీ డిమాండ్ ఏర్పడింది. చాలా చోట్ల దీని మందులు దొరకే పరిస్థితి లేదు. రెమిడెసివిర్‌ను బ్లాక్ మార్కెట్ అయినట్టుగానే.. బ్లాక్ ఫంగస్ మందులను అధిక ధరలకు అమ్ముతున్నారు కేటుగాళ్లు..

ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ వివరాలను పేర్కొన్న ఫార్మట్‌లో వివరాలను పంపిస్తే.. ప్రభుత్వమే బాధితులకు ఆయా మందులను అందజేస్తుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బ్లాక్ ఫంగస్ మందులు కావాల్సిన వారు dme@telangana.Gov.in, ent-mcrm@telangana.Gov.inకు పూర్తి వివరాలతో మెయిల్ చేయాలని ఆయన ట్వీట్ చేశారు.


పేషెంట్‌ చికిత్స పొందుతున్న ఆస్పత్రి, ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అప్లికేషన్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసి DMETELANGANA, KTRofficeకు ట్యాగ్ చేస్తే ఫాలో అప్ చేస్తారని కేటీఆర్ తెలిపారు. ఆయా దరఖాస్తులను అధికారులు పరిశీలించి నిర్ధారించిన తర్వాత మాతమ్రే ప్రభుత్వమే వారికి మందులను పంపిణీ చేస్తుంది.