పొరపాటైంది: క్షమించమని వేడుకున్న ఆకాశవాణి సిబ్బంది

పాడి పంట చిన్నమ్మ బతికే ఉన్నారు. 

  • Published By: chvmurthy ,Published On : January 20, 2019 / 06:44 AM IST
పొరపాటైంది: క్షమించమని వేడుకున్న ఆకాశవాణి సిబ్బంది

పాడి పంట చిన్నమ్మ బతికే ఉన్నారు. 

ఆల్ ఇండియా రేడియోలో  వచ్చే  పాడి పంట కార్యక్రమంలో  చిన్నమ్మగా  చిరపరిచితురాలైన నిర్మలా వసంతన్ మరణించారని  2 రోజులు క్రితం పేపర్లలో వార్తలు వచ్చాయి. కానీ వాస్తవానికి ఆమె మరణించలేదు. బతికే ఉన్నారు. 73 ఏళ్ల నిర్మలా వసంత్ ఆనారోగ్యంతో జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. నిర్మల మృతి చెందారని ఆకాశవాణి సిబ్బంది సంతాప సభ నిర్వహించటం, అది పేపర్లలో రావాటం, ఆవార్త నిర్మల కుటుంబ సభ్యులు, అభిమానులు చూసి అవాక్కవటం జరిగింది. కుటుంబ సభ్యులు ఆకాశవాణి సిబ్బందిని సంప్రదించి ఆమె బతికే ఉన్నారనే విషయం చెప్పటంతో ఆకాశవాణి సిబ్బంది క్షమించమని కోరుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.  
పొరపాటుకు దారి తీసిన పరిస్ధితులను  ఆకాశవాణి సిబ్బంది వివరిస్తూ……
నిర్మలావసంత్ ఆరోగ్య పరిస్ధితిపై  ఆమెతో 30 ఏళ్లు కలిసి పని చేసిన జ్యోత్స్నకు కబురు పెట్టారని…. ఆ క్రమంలో ఆమె ఇక లేరు అంటూ చెప్పారని…. అంత్యక్రియలకు ఏర్పాట్లపైనా మాట్లాడారని పేర్కోన్నారు. తర్వాత కుటుంబ సభ్యులు ఎవరూ ఫోన్ లిఫ్టు చేయకపోవటం, ల్యాండ్ లైన్ కు కూడా అందుబాటులోకి రాకపోవటంతో ఆకాశవాణి వార్తల్లో ఆమె మరణించారని వార్త ప్రసారం చేశారు. ఆతర్వాత 2 రోజులకు జనవరి 17న ఆమె సంతాప సభ నిర్వహించి పత్రికలకు వార్త పంపారు. పేపర్లలో వార్తను చూసిన నిర్మల వసంత్ రెండో కుమార్తె వెంటనే ఆకాశవాణికి ఫోన్ చేసి ఆమె బతికే ఉన్నారని, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని చెప్పటంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యామని సిబ్బంది పేర్కోన్నారు. ఆమె వీలైనంత త్వరగా కోలుకోవాలని  ఆకశవాణి సిబ్బంది ఆకాంక్షించారు. 
తమిళనాడుకు చెందిన  నిర్మల కుటుబం  ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కడప జిల్లాలో స్ధిరపడ్డారు. ఆమెకు హైదరాబాద్ కుచెందిన వసంత్ తో వివాహం అయ్యింది. భర్త వసంత్  నిజాం కాలేజీలో ఇంగ్లీషు విభాగంలో పనిచేసేవారు. వివాహానంతరం ఆమె హైదరాబాద్ కు మకాం మార్చి పల్లెటూరి అమాయక మహిళా రైతుల  గొంతుతో రైతుల సందేహాలకు, పెద్దయ్య ద్వారా సమాధానాలు రాబడుతూ రైతుల సమస్యలు తీరుస్తూ అందరి మన్ననలు పొందారు. 2019 జనవరి 8న ఆకాశవాణిలో జరిగిన పూర్వ ఉద్యోగుల సమావేశంలో కూడా ఆమె ఉత్సాహంగా పాల్గోన్నారు.