కరోనా.. కింగ్ కోఠి ఆసుపత్రిలో కలకలం..రోగుల మధ్య మృతదేహం

  • Published By: madhu ,Published On : April 14, 2020 / 04:07 AM IST
కరోనా.. కింగ్ కోఠి ఆసుపత్రిలో కలకలం..రోగుల మధ్య మృతదేహం

Updated On : April 14, 2020 / 4:07 AM IST

కరోనాతో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. అందరూ ఉండి కూడా..ఒంటరై పోతున్నాడు. మృతి చెందుతున్న వారి పరిస్థతి మరీ దయనీయంగా మారింది. ఓ వృద్ధుడు వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ…చనిపోయాడు. కానీ ఆ డెడ్ బాడీని ఎవరూ తీసుకెళ్లెకపోవడంతో..రోగుల మధ్యే ఉంచిన ఘటన కలకలం రేపుతోంది. సుమారు 15 గంటల పాటు మృతదేహాన్ని ఇతర పేషెంట్ల మధ్య ఉంచడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇతనికి కరోనా ఉందా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. ఈ ఘటన ఎక్కడో చోటు చేసుకోలేదు. హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. 

తీవ్ర జ్వర, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో 65 సంవత్సరాులున్న వృద్ధుడు కింగ్ కోఠి జిల్లా పరిషత్ ఆసుపత్రిలో చేరాడు. కరోనా లక్షణాలు ఉండడంతో వైద్యులు పరీక్షించారు. అనంతరం అనుమానితులున్న ఐసోలేషన్ వార్డులో ఉంచారు. 2020, ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం అడ్మిట్ అయ్యాడు. కానీ అదే రోజు అర్ధరాత్రి మృతి చెందాడు. అక్కడున్న సిబ్బంది గమనించి..అక్కడున్న రోగుల మధ్యే ఉంచారు. ఇక్కడ పది మంది దాక ఉన్నారు. వీరంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.

ఉదయం నారాయణగూడ పోలీసులు, ఆబిడ్స్‌ ఏసీపీ బిక్షంరెడ్డి.. జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చినా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాలేదు. డెడ్ బాడీని కనీసం కవర్ కూడా చేయలేదు. ఆదివారం మధ్యాహ్నం 2.30గంటలకు అంబులెన్స్ వచ్చింది. కానీ..మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ రాలేదు. ఇలా టైం గడిచిపోయింది. చివరకు సాయంత్రం 5 గంటల సమయంలో తగిన జాగ్రత్తలతో డెడ్ బాడీని ముషీరాబాద్ లోని ఏక్ మినార్ శ్మశానవాటికకు తరలించారు. 

ఇక వృద్ధుడు విషయానికి వస్తే…డబీర్ పురాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. భార్య, కుమారుడు, కోడలు, మనువడు, మనువరాలితో కలిసి అహ్మదాబాద్ లోని దర్గాకు ప్రార్థనలకు వెళ్లినట్లు నిర్ధారించారు. తిరిగి 2020, మార్చి 24వ తేదీన హైదరాబాద్ కు చేరుకున్న అనంతరం జ్వరం, దగ్గు, జలుబుతో బాధ పడుతున్నాడు. ఏప్రిల్ 09వ తేదీన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అదే రోజు అర్ధరాత్రి మృతి చెందడం…రాత్రంతా మృతదేహం ఇతర పేషెంట్ల మధ్యే ఉండటంతో వారికి కూడా కరోనా వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. 

Also Read | మోడీ మాటకు ముందే: జాతిని ఉద్దేశించి సోనియా గాంధీ సందేశం