Snake Found In Sambar : భోజనం చేస్తుండగా సాంబర్ లో కనిపించిన పాము.. ఈసీఐఎల్ క్యాంటీన్ లో ఘటన

పరిశ్రమలోని ప్రధాన క్యాంటీన్ లో అనునిత్యం వంట కార్మికులు.. ఉద్యోగుల కోసం వంట వండి వడ్డిస్తుంటారు. క్యాంటీన్ లో వంట చేసిన అనంతరం ఇతర డివిజన్లకు భోజనం పంపిణీ చేస్తుంటారు.

Snake Found In Sambar : భోజనం చేస్తుండగా సాంబర్ లో కనిపించిన పాము.. ఈసీఐఎల్ క్యాంటీన్ లో ఘటన

snake

Updated On : July 22, 2023 / 1:19 PM IST

Hyderabad ECIL Canteen : హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)పరిశ్రమలోని క్యాంటీన్ లో సాంబర్ లో పాము కనిపించింది. దీంతో ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు గురైనట్లు తెలిసింది. పరిశ్రమలోని ప్రధాన క్యాంటీన్ లో అనునిత్యం వంట కార్మికులు.. ఉద్యోగుల కోసం వంట వండి వడ్డిస్తుంటారు. క్యాంటీన్ లో వంట చేసిన అనంతరం ఇతర డివిజన్లకు భోజనం పంపిణీ చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం క్యాంటీన్ లో వంట చేసిన అనంతరం ఈఎంఎస్డీ డివిజన్ కు యథావిధిగా క్యాంటీన్ సిబ్బంది భోజనాన్ని పంపించారు. అయితే, అక్కడ కార్మికులు మధ్యాహ్నం భోజనం చేస్తుండగా సాంబర్ లో ఉడికిన పాము కనిపించింది. దీంతో వెంటనే కార్మికులు యూనియన్ నాయకులకు, యాజమాన్యానికి సమాచారం అందించారు.

Snakes : పాములు అంతరించిపోవటం వల్ల .. ఆడబిడ్డలకు వివాహాలు కావటంలేదట

వెంటనే ఈఎంస్డీ డివిజన్ కు వచ్చిన అధికారులు ఇతర డివిజన్లకు సమాచారం అందించి సాంబర్ ను వడ్డించకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఈఎంఎస్డీలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు ఇంజక్లన్లు, మందులను పంపిణీ చేశామని అధికారులు పేర్కొన్నారు.