Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం సృష్టించింది.

IndiGo Flight
Shamshabad International Airport : శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం సృష్టించింది. కోయంబత్తూరు, చెన్నై వయా హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో.. శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు. అధికారులు ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. అనంతరం బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు చేపింది.
ఆరు గంటలు తనిఖీలు చేసిన తరువాత బాంబు ఉన్న ఆనవాళ్లు ఏమీలేవని తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ సమయంలో ఇండిగో విమానంలో 181 మంది ప్రయాణికులు ఉన్నారు.