Tempo Driver Mystery: మిస్టరీగా మారిన టెంపో డ్రైవర్ శ్రీనివాస్ ఒంటిపై కుట్లు: గత నెల గోవా వెళ్లి అదృశ్యమైన శ్రీనివాస్

హైదరాబాద్ బోరబండకు చెందిన టెంపో డ్రైవర్ శ్రీనివాస్ ఉదంతం మిస్టరీగా మారింది గోవా వెళ్లిన తనకు ఎవరో మత్తుమందు ఇచ్చి తన శరీరంలోని అవయవాలు దొంగిలించారంటూ డ్రైవర్ శ్రీనివాస్ చెప్పడం

Tempo Driver Mystery: మిస్టరీగా మారిన టెంపో డ్రైవర్ శ్రీనివాస్ ఒంటిపై కుట్లు: గత నెల గోవా వెళ్లి అదృశ్యమైన శ్రీనివాస్

Crime

Updated On : April 6, 2022 / 8:30 AM IST

Tempo Driver Mystery: హైదరాబాద్ బోరబండకు చెందిన టెంపో డ్రైవర్ శ్రీనివాస్ ఉదంతం మిస్టరీగా మారింది. గోవా వెళ్లిన తనకు ఎవరో మత్తుమందు ఇచ్చి తన శరీరంలోని అవయవాలు దొంగిలించారంటూ డ్రైవర్ శ్రీనివాస్ చెప్పడం సంచలనంగా మారింది. తలకు,పొట్ట భాగంలో కుట్లతో మంగళవారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరిన శ్రీనివాస్ ను పరీక్షించిన వైద్యులు అతని శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నట్లు తేల్చారు. అయితే మరి శరీరంపై ఉన్న కుట్లు ఏమిటనే విషయం మాత్రం మిస్టరీగా ఉండిపోయింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధి బోరబండలో నివాసముంటున్న శ్రీనివాస్..టెంపో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మార్చి 19న 10 మందిని గోవా తీసుకువెళ్లిన శ్రీనివాస్ 20న సాయంత్రం అదృశ్యమయ్యాడు. దీంతో కూడా వచ్చిన ప్రయాణికులు బోరబండలోని శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకుని గోవా వెళ్లిన కుటుంబ సభ్యులు అక్కడ శ్రీనివాస్ కోసం గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో గోవాలోని అంజునా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Also read:Telangana : పాములు పట్టే వ్యక్తి పాము కాటుతో మృతి

ఇంతలో తనంతట తానే ఇంటికి చేరుకున్న శ్రీనివాస్..తలకు, పొట్ట భాగంలో కుట్లు ఉన్నాయి. గోవాలో ఎవరైనా శ్రీనివాస్ పై మత్తు ప్రయోగం చేసి శరీర అవయవాలు తీసుకున్నారని కుటుంబ సభ్యులు అనుమానించారు. ఆసుపత్రిలో చేరేందుకు కూడా కుటుంబ ఆర్ధిక పరిస్థితి సహకరించకపోవడంతో మిన్నకుండిపోయారు. అయితే ఇంతలో గోవాలో ఉన్న ప్రయాణికులు..శ్రీనివాస్ కు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో టెంపో యజమానికి సమాచారం ఇచ్చారు. గోవా చేరుకుని ప్రయాణికులను తీసుకువచ్చిన టెంపో యజమాని..ఈ విషయమై నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ సహాయంతో బాధితులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు పిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. శ్రీనివాస్ ను నిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. శ్రీనివాస్ ను పరీక్షించిన వైద్యులు అతని శరీర అవయవాలు బాగానే ఉన్నాయని, ప్రాణానికి ప్రమాదం ఏమి లేదని తేల్చారు.

Also read:Telangana Covid Bulletin News : తెలంగాణలో కొత్తగా 30 మందికి కరోనా

గోవాలో శ్రీనివాస్ ఏదైనా ప్రమాదానికి గురై ఉంటాడని..స్థానికులెవరైనా ఆసుపత్రికి తరలించగా అక్కడ కుట్లు వేసి ఉండొచ్చని పరీక్షలు చేసిన నిమ్స్ ఎమర్జెన్సీ విభాగం వైద్యులు అంటున్నారు. ఎవరో మత్తు మందు ఇచ్చి అతని అవయవాలు తీసుకున్నట్లు తొలుత అనుమానించిన కుటుంబ సభ్యులు..శ్రీనివాస్ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని నిమ్స్ వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే గోవా నుంచి తిరిగి వచ్చిన డ్రైవర్ శ్రీనివాస్ అక్కడ ఏం జరిగిందనే విషయంపై స్పష్టత లేకున్నాడు. శ్రీనివాస్ పూర్తిగా కోలుకుంటే అసలు విషయం తెలిసే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Also read:Bride Suicide : పెళ్లైన రెండు నెలలకే నవ వధువు బావిలో దూకి ఆత్మహత్య