Bhatti Vikramarka : తెలంగాణ వనరులను దోచేస్తున్న ప్రభుత్వ పెద్దలు : భట్టి విక్రమార్క

సంపద, వనరులు, స్వేచ్ఛ పాలకులకే పరిమితమయ్యాయని తెలిపారు. తాము ఏం చేశామో ప్రజలకు తెలుసన్నారు. తొమ్మిది ఎండ్లలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

Bhatti Vikramarka : తెలంగాణ వనరులను దోచేస్తున్న ప్రభుత్వ పెద్దలు : భట్టి విక్రమార్క

Bhatti Vikramarka (1)

Updated On : July 15, 2023 / 4:45 PM IST

CLP Leader Bhatti Vikramarka : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల సంపద ప్రజలకు పంచడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో ఫ్యూడల్స్, దేశంలో క్యాప్టలిస్టులు కలిసి తెలంగాణని ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలే తమ అజెండా అని అన్నారు. ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే ప్రభుత్వాన్ని తెస్తామని మాట ఇస్తున్నామని చెప్పారు.

సంపద, వనరులు, స్వేచ్ఛ పాలకులకే పరిమితమయ్యాయని తెలిపారు. తాము ఏం చేశామో ప్రజలకు తెలుసన్నారు. తొమ్మిది ఎండ్లలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వనరులను ప్రభుత్వ పెద్దలు దొచేస్తున్నారని వెల్లడించారు. ధరణి అనేది మహమ్మారి లాగా అయిందని విమర్శించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

Heavy Rains : రాగల రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బెల్ట్ షాపులు క్లోజ్ చేయాలని ప్రజలు అడిగారని తెలిపారు. చేనేత కార్మికులు జీఎస్టీ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత కాంగ్రెస్ కి పట్టం కట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. సింగరేణిని బొంద పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని విద్యార్థులు అనుకుంటున్నారని వెల్లడించారు. ధరణితో తమ భూములు తమకు కాకుండా చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు.

కేసీఆర్ పాలనలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరని పేర్కొన్నారు. తెలంగాణలో స్వేచ్ఛనే లేకుండా పోయిందని ఆరోపించారు. తెలంగాణలో భయం భయంగా బతకాల్సిన పరిస్థితి ఉందన్నారు. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతిలోకి పోయిందని విమర్శించారు. 20 మిలియన్ స్క్వేర్ ఫీట్స్ రియల్టర్ ఒక పక్కన…కట్టుకోవడానికి 20 గజాల స్థలం లేని వాళ్ళు మరో పక్కన ఉన్నారని వెల్లడించారు.

CP CV Anand : కేబీఆర్ పార్క్ చుట్టూ 264 సీసీ కెమెరాలు.. 15 నిమిషాల్లో నేరం చేసిన వ్యక్తిని గుర్తిస్తున్నాం : సీపీ సీవీ ఆనంద్

వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకుంటున్న కాంట్రాక్టర్ ఒక వైపు.. తినడానికి తిండి లేని ప్రజలు మరోవైపు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలకి వివరించేలా కాంగ్రెస్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి దాని వల్ల ప్రజలకు ఏం లాభం జరిగిందో ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగి ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు.