Palla Rajeshwar Reddy : బీఆర్ఎస్ MLC పల్లాకు అధిష్టానం షాక్.. మంత్రి కేటీఆర్ సీరియస్ వార్నింగ్
జనగామ మీటింగ్ కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. మధ్యలోనే వెనుదిరిగారు. Palla Rajeshwar Reddy - Minister KTR

Palla Rajeshwar Reddy - Minister KTR
Palla Rajeshwar Reddy – Minister KTR : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. జనగామ జిల్లాలో నేతలు రహస్య సమావేశాలు నిర్వహించవద్దని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అభ్యర్థి పేరు ప్రకటించే వరకు రహస్య భేటీలు ఏర్పాటు చేయవద్దన్నారు. దీంతో జనగామ జిల్లా నిడిగొండలో పల్లా అనుచరుల సమావేశానికి బ్రేక్ పడింది. జనగామ మీటింగ్ కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. మధ్యలోనే వెనుదిరిగారు. అర్ధాంతరంగా సమావేశం ముగియడంతో తరిగొప్పుల, నర్మెట్ట మండలాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, నేతలు వెళ్లిపోయారు.
జనగామ అసెంబ్లీ టికెట్ పై చర్చించేందుకు రఘునాథపల్లి మండలం నిడిగొండలోని ఓ ఫంక్షన్ హాల్ లో పల్లా అనుచరులు సమావేశం అయ్యారు. జనగామ జెడ్పీ ఛైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి.. పల్లాకు మద్దతుగా సమావేశాన్ని సమన్వయం చేశారు. అయితే, ఈ విషయం పార్టీ హైకమాండ్ కు తెలిసింది. దీంతో హైకమాండ్ అలర్ట్ అయ్యింది. అభ్యర్థి పేరు ప్రకటించే వరకు ఎవరూ రహస్య సమావేశాలు నిర్వహించవద్దని పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. కార్యకర్తలు, నేతలతో రహస్య సమావేశాలు నిర్వహించవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు.