ప్రాజెక్టుల చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ .. మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌, పాలమూరుకు కాంగ్రెస్

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఇవాళ బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు. బ్యారేజీ పరిశీలన అనంతరం అక్కడే ఎమ్మెల్యేలు హరీష్ రావు, కడియం శ్రీహరిలు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

ప్రాజెక్టుల చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ .. మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌, పాలమూరుకు కాంగ్రెస్

Telangana Irrigation Projects

Telangana Politics Around Projects : తెలంగాణ రాజకీయాలు ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పర్యటనకు వెళ్తుండగా.. మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుల పరిశీలనకు కాంగ్రెస్ నేతలు శ్రీకారం చుట్టారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఇరు పార్టీల మధ్య ప్రాజెక్టుల చుట్టూ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

Also Read : Chalo Medigadda : చలో మేడిగడ్డ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కౌంటర్ అటాక్

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఇవాళ బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు. బ్యారేజీ పరిశీలన అనంతరం అక్కడే ఎమ్మెల్యేలు హరీష్ రావు, కడియం శ్రీహరిలు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నేతల చలో మేడిగడ్డ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పుట్ట మధు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మేడిగడ్డ పర్యటనకు భద్రత ఏర్పాటు చేయాలని సీపీని వరంగల్ బీఆర్ఎస్ బృందం కలిసింది. కాంగ్రెస్ చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టడానికే చలో మేడిగడ్డ అంటూ, మేడిగడ్డ సందర్శన అనంతరం అక్కడే ప్రజలకు వాస్తవాలు వివరిస్తామంటూ బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. మరమ్మతులు చేయాల్సింది పోయి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు, పార్టీ ముఖ్యనేతలు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరారు. చిన్నలోపాన్ని పెద్ద భూతద్దంలో చూపిస్తూ బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకే చలో మేడిగడ్డకు పిలుపునివ్వడం జరిగిందని కేటీఆర్ అన్నారు.

Also Read : Chalo Medigadda : మేడిగడ్డకు సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు.. అక్కడే ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

మరోవైపు బీఆర్ఎస్ మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు వ్యతిరేకంగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టుల పరిశీలనకు కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. గత ప్రభుత్వంలో పాలమూరు- రంగారెడ్డిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 28 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి.. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత భూత్పూర్ మండలం కరివెన రిజర్వాయర్ ను నేతలు పరిశీలిస్తారు.. ఆ తరువాత జడ్చర్ల నియోజకవర్గంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను నేతలు పరిశీలించనున్నారు. చివరగా షాద్ నగర్ నియోజకవర్గం లోని ఇంకా పనులు ప్రారంభంకాని కేపీ లక్ష్మీదేవి పల్లి ని కాంగ్రెస్ నేతలు పరిశీలించనున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటాపోటీ ప్రాజెక్టుల సందర్శనలతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి.