MLA Sayanna’s Last Rites : ప్రభుత్వ లాంఛనాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు సోమవారం (ఫిబ్రవరి20,2023) జరుగనున్నాయి. బన్సీలాల్ పేటలో ప్రభుత్వ లాంఛనాలతో సాయన్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

MLA Sayanna’s Last Rites : ప్రభుత్వ లాంఛనాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు

MLA Sayanna

Updated On : February 20, 2023 / 8:13 AM IST

MLA Sayanna’s Last Rites : అనారోగ్యంతో కన్నుమూసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు సోమవారం (ఫిబ్రవరి20,2023) జరుగనున్నాయి. బన్సీలాల్ పేటలో ప్రభుత్వ లాంఛనాలతో సాయన్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానుల సందర్శనార్థం సాయన్న పార్థీవదేహాన్ని ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఖార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉంచనున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు సాయన్నకు నివాళులర్పించాక, సాయంత్రం బన్సిలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారుు.

ఫిబ్రవరి 16న గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సాయన్నను బంధువులు యశోద ఆస్పత్రికి తరలించారు. గతంలో సాయన్నకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ కావడంతో షుగర్ లెవల్స్ పెరిగి కిడ్నీలపై ప్రభావం పడిందని వైద్యులు అన్నారు. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం 1:50 గంటలకు కార్డియాక్ అరెస్టుతో సాయన్న తుది శ్వాస విడిచారు.

BRS MLA Sayanna: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత.. కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం

దీంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సాయన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. కంటోన్మెంట్ ప్రజలకు సాయన్న చేసిన సేవలు మరువలేనివని సీఎం కేసీఆర్ అన్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సాయన్న పార్థీవదేహానికి నివాళులర్పించారు.

మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు సాయన్న భౌతికకాయానికి నివాళులర్పించారు. సాయన్న కుంటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సాయన్నతో తమకు వ్యక్తిగతంగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాయన్న మృతి బీఆర్ఎస్ కు తీరని లోటు అని అన్నారు.