MLC Kavita : రాహుల్ గాంధీ మీ స్క్రిప్ట్ రైటర్‎ని మార్చుకోండి : కవిత సెటైర్లు

తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని..ఇందిరా గాంధీ నుంచి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు అందరు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. గాంధీ కుటుంబం తెలంగాణకు అన్యాయం చేశారు అంటూ దుయ్యబట్టారు.

MLC Kavitha Counter to Rahul Gandhi Comments

MLC Kavitha Fires on Rahul Gandhi : రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు విమర్శలతో వాడి వేడి వ్యాఖ్యలతో సెటైర్లు వేస్తున్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత రాహుల్ గాంధీపై విమర్శలు,సెటైర్లతో విరుచుకపడుతున్నారు. దీంట్లో భాగంగా కవిత ‘ రాహుల్ గాంధీ మీ స్క్రిప్ట్ రైటర్‎ని మార్చుకోండి..ఎవరో రాసిచ్చింది చదవుతున్నారు’ అంటూ ఎద్దేవా చేశారు. ఇందిరా గాంధీ, నెహ్రూలకు తెలంగాణతో అనుబంధం ఉంది అంటూ జగిత్యాల పర్యటలో రాహుల్ మాటలకు కవిత కౌంటర్ఇచ్చారు.

మెట్ పల్లిలో కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతు.. తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని..అప్పుడు ఇందిరా గాంధీ నుంచి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు అందరు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. గాంధీ కుటుంబం తెలంగాణకు అన్యాయం చేశారు అంటూ దుయ్యబట్టారు. తెలంగాణ విద్యార్దుల మరణాలకు సోనియాగాంధీ కారణమయ్యారు అంటూ విమర్శించారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ అంటూ రాహల్ అంటున్నారు కానీ సోనియా తెలంగాణను ఊరికే ఇవ్వలేదు. మా తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు..కేసీఆర్ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలపెడితే రాష్ట్రం వచ్చిందన్నారు.

Rahul Gandhi : ఇవి దొరల తెలంగాణకు, ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు : రాహుల్ గాంధీ

సోనియా గాంధీ ఎప్పుడు ఆంధ్రా గురించే మాట్లాడతారు..కానీ తెలంగాణ గురించి మాట్లాడనే మాట్లాడరని ఆమె తెలంగాణకు అన్యాయం చేశారు అంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడే వస్తారు అందుకే ఆయన రాహుల్ గాంధీ కాదు ఎన్నికల గాంధీ అంటూ ఎధ్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం సోనియా మాట్లాడతారు..కానీ తెలంగాణ గురించి ఒక్క మాటకూడా మాట్లాడని ఆమె తెలంగాణ ఇచ్చారు అంటే నమ్మేందుకు ఎవరు సిద్దంగా లేరని ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ది చెబుతారని అన్నారు.