కవిత అరెస్టుకు మూడు నెలలు పూర్తి.. ఇవాళ ములాఖత్ కానున్న మాజీ మంత్రులు

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి మూడు నెలలు పూర్తవుతుంది. 80రోజులుగా తీహార్ జైల్లోనే కవిత ఉంటున్నారు.

కవిత అరెస్టుకు మూడు నెలలు పూర్తి.. ఇవాళ ములాఖత్ కానున్న మాజీ మంత్రులు

MLC Kavitha

MLC Kavitha Arrest : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి మూడు నెలలు పూర్తవుతుంది. 80రోజులుగా తీహార్ జైల్లోని 6 నంబర్ (మహిళ ఖైదీలు) కాంప్లెక్స్ లోనే కవిత ఉంటున్నారు. ఇవాళ తీహార్ జైల్లోని ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు ములాఖత్ కానున్నారు. రెండురోజుల క్రితం కవితతో ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ ములాఖత్ అయ్యారు. అంతేకాక.. కేసీఆర్, కుటుంబ సభ్యులు కవితతో ఫోన్లో మాట్లాడుతున్నారు.

Also Read : MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్ట్ అయిన కవిత తీహార్ జైలులో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనిలాండరింగ్ కేసులో మార్చి 15న కవితన ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు దఫాలుగా 10రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. 14 రోజులకు ఒకసారి కవిత జ్యుడీషియల్ కస్టడీ ని కోర్టు పొడిగిస్తూ వస్తుంది. తీహార్ జైల్ లో జ్యూడీషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11న కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం సీబీఐ కేసులోనూ రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. సీబీఐ కేసులో కవిత జ్యూడీషియల్ కస్టడీని మే20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కోర్టు అనుమతితో జైల్లో పలు పుస్తకాలను చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో కవిత గడుపుతున్నారు.

Also Read : 48 గంటల్లోనే మరణం..! ప్రపంచాన్ని కలవరపెడుతున్న మరో డేంజరస్ వ్యాధి

లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐల అరెస్ట్ లను సవాల్ చేస్తూ, బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యూలర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు లో సవాల్ చేయగా.. కవిత బెయిల్ పిటిషన్ల పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇదిలాఉంటే తీహార్ జైల్ లో ఉన్న కవితతో ఆమె భర్త అనిల్ వారానికి రెండు సార్లు ములాఖత్ అవుతున్నారు. ప్రతిరోజు కవితతో ఐదు నిమిషాలు ఫోన్లో కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు.