MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
MLC Kavitha : సీబీఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 21 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది.

BRS MLC Kavitha
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. సీబీఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 21 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది.
తదుపరి విచారణను కోర్టు జూన్ 21కి వాయిదా వేసింది. సీబీఐ కేసులో కవితపై దాఖలైన చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకున్న రౌస్ రెవిన్యూ కోర్టు.. ఆమె కస్టడీని పొడిగించింది.
మరోవైపు.. కవిత చదువుకోవడానికి కొత్తగా తొమ్మిది పుస్తకాలు కావాలని కోర్టును కోరింది. ఇందుకు రౌస్ రెవిన్యూ కోర్టు అంగీకరించింది.
Read Also : కొడాలి నాని ఇంటిపై రాళ్లు, గుడ్లు విసిరిన టీడీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తత