ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తమ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

KCR
సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతోంది. డిసెంబర్ 9 నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.
ప్రభుత్వ ఏడాది కాల వైఫల్యాలను ఎండగట్టేలా బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భోజనం చేశారు. అనంతరం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తమ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో నెలకొన్న పలు సమస్యల గురించి కేసీఆర్ ప్రస్తావించారు.
కేసీఆర్ ఫాంహౌస్ కి మాజీ మంత్రులు మల్లారెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు వెంకట్ రాంరెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, శంబిపూర్ రాజు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మధుసూదనాచారి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.