Bus Ticket Cock : బస్సులో కోడిపుంజుకు టికెట్.. స్పందించిన సజ్జనార్
సాధారణంగా ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎవరైనా సరే టికెట్ తీసుకోవాల్సిందే.. లగేజీలతో పాటు చిన్నపిల్లలకు కూడా బస్పులో టికెట్ తీసుకోవాల్సిందే.

Bus Conductor Ticket To Coc
Bus Conductor ticket to Cock : సాధారణంగా ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎవరైనా సరే టికెట్ తీసుకోవాల్సిందే.. లగేజీలతో పాటు చిన్నపిల్లలకు కూడా బస్పులో టికెట్ తీసుకోవాల్సిందే.. పిల్లలకు అయితే హాఫ్ టికెట్.. పెద్దవాళ్లకు ఫుల్ టికెట్ అడుగుతారు కండక్టర్లు. బస్సు ఎక్కిన తర్వాత ప్రయాణికులకు కండక్టర్‌కు మధ్య టికెట్ విషయంలో చాలాసార్లు వాదనకు జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో బస్సు కండక్టర్లు చిన్న పిల్లలు సైతం టికెట్ తీసుకోవాల్సిందేని చెబుతుంటారు. కొన్నిసార్లు బస్ కండక్టర్, ప్రయాణికుల మధ్య గొడవ తారా స్థాయికి చేరుతుంది. ఈ క్రమంలో బస్సు నుంచి ప్రయాణికులను దింపేస్తుంటారు.. లగేజీ ఛార్జీలు కూడా వసూలు చేస్తారు.
ఈ బస్సు కండక్టర్ కూడా టికెట్ విషయంలో అదే పనిచేశాడు. అయితే ఇదేదో లగేజీకో లేదా చిన్నపిల్లలకో కాదండోయ్.. కోడిపుంజుకు టికెట్ కొట్టాడు.. అవును మీరు చదివింది నిజమే.. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ కండక్టర్ కోడిపుంజుకు ఎంత ఛార్జీ వసూలు చేశాడో తెలుసా.. అక్షరాలా రూ.30. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గోదావరిఖని నుంచి కరీంనగర్ వెళ్తోంది. మహమ్మద్ అలీ అనే ప్రయాణికుడు బస్సు ఎక్కాడు. కరీంనగర్ వెళ్లేందుకు టికెట్ తీసుకున్నాడు. అతడి వెంట ఓ కోడిపుంజు కూడా ఉంది. బస్సు సుల్తానాబాద్ వద్దకు చేరుకున్న సమయంలో కండక్టర్ తిరుపతికి కోడిపుంజు శబ్దం వినిపించింది. వెంటనే.. కోడికి రూ.30 టికెట్ కొట్టి అలీ చేతికిచ్చాడు కండక్టర్.
I will look into this Please
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 8, 2022
ఆ టికెట్ చూసిన ప్రయాణికుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అదేంటీ కండక్టర్ సాబ్.. కోడికి టికెట్ ఏంటి? అని అన్నాడు. ప్రాణంతో ఉండే ప్రతీ జీవికి టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ చెప్పడంతో ప్రయాణికుడికి ప్యూజులు ఎగిరిపోయాయి. చేసేది ఏమిలేక టికెట్‌కు చిల్లరతో ఇచ్చేశాడు. నెటిజన్లు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్పందించిన సజ్జనార్.. వెంటనే దృష్టి సారిస్తామని సమాధానమిచ్చారు.
Read Also : Suryakumar Yadav: ‘సార్.. నన్ను నాలాగే ఉండనివ్వండి’