Suryakumar Yadav: ‘సార్.. నన్ను నాలాగే ఉండనివ్వండి’

ఇండియన్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ జర్నలిస్టుకు రిప్లైతో కౌంటర్ ఇచ్చేశాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో రెండో వన్డే జరగనుంది.

Suryakumar Yadav: ‘సార్.. నన్ను నాలాగే ఉండనివ్వండి’

Surya Kumar Yadav

Suryakumar Yadav: ఇండియన్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ జర్నలిస్టుకు రిప్లైతో కౌంటర్ ఇచ్చేశాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో రెండో వన్డే జరగనుంది. రెండు సార్లు 36 బంతులతో 34 పరుగులు, ఐదో వికెట్ గా 62పరుగులు చేశాడు. అలా ఆస్ట్రేలియా గ్రేట్ ప్లేయర్ మైకెల్ బెవన్ తో పోల్చుతూ ప్రశ్నించాడు జర్నలిస్టు. రెండో వన్డేకుముందు జరిగిన ప్రెస్ కాన్ఫిరెన్స్ లో మైకెల్ బేవన్ తో పోల్చినందుకు ఇలా స్పందించాడు.

‘నన్ను నాలాగే సూర్యకుమార్ యాదవ్ లానే ఉండనివ్వండి. ఇండియాకు 5 నుంచి 7 మ్యాచ్ లు మాత్రమే ఆడాను. కానీ, నేను ప్రయత్నిస్తూనే ఉంటా. పొజిషన్ ఏదైనా `సరే బ్యాటింగ్ చేస్తాను? నా జట్టు కోసం గెలవడానికే ట్రై చేస్తా. నాలాగే ఆడతా. ఎప్పుడూ భయం లేకుండా ఆడతా’ అని వెల్లడించాడు.

మార్చి 2021లో అంతర్జాతీయ క్రికెట్ కు అరంగ్రేటం చేశాడు. ఇండియాలో ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో తొలిసారి ఆడాడు. అన్ని ఫార్మాట్లతో కలిపి 16 మ్యాచ్ లు ఆడాడు సూర్యకుమార్. 5వన్డే గేమ్స్ లో 197 పరుగులు, 11 టీ20లలో 244పరుగులు చేశాడు.

Read Also : గుండెకే కాదు, ఎముకలకు మేలు చేసే క్యాబేజీ

‘నేను చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నా. టీమ్ మేనేజ్మెంట్ ఎలా బ్యాటింగ్ చేయమంటే ఆ పొజిషన్ లో చేస్తా. మూడు, నాలుగు, ఐదో పొజిషన్లలో బ్యాటింగ్ చేశా. అంతా బాగా జరుగుతున్నందుకు ప్రస్తుతం సంతోషంగా ఉన్నా’ అంటున్నాడు సూర్యకుమార్.