ప్రేమ పేరుతో మోసం చేశాడని.. యూట్యూబర్ హర్షసాయిపై యువతి కేసు
ఈ మేరకు రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసులు కేసు నమోదుచేశారు.

Youtuber harsha sai: ప్రేమ పేరుతో మోసం చేశాడని యూట్యూబర్ హర్షసాయిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసులు కేసు నమోదుచేశారు. అడ్వకేట్‌తో కలిసి నార్సింగి పీఎస్‌కి వచ్చి మరీ ఫిర్యాదు చేసింది బాధితురాలు.
హర్షసాయికి యూట్యూబ్‌లో 10 మిలియన్లకు పైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు. అతడి వీడియోలను మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తాయి. పేదలకు సాయం చేస్తూ వీడియోలు తీసుకుని వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ అతడికి మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు.
ఇప్పటికే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అతడిపై యువతి ఫిర్యాదు చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.
‘మెగా’ అనే సినిమాతోనూ అతడు వెండితెరపైకి అడుగు పెడుతున్నాడు. అయనే హీరోగా, దర్శకుడి ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు బాలచంద్ర సహనిర్మాత. బాధితురాలికి సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. హర్ష సాయితో కలిసి మెగా సినిమా నిర్మించింది బాధితురాలు. ఇప్పుడ ఆమే అతడిపై ఫిర్యాదు చేసింది. హర్షసాయి తండ్రి రాధాకృష్ణపై సైతం ఆమె ఫిర్యాదు చేసింది.
రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా.. తదుపరి కార్యాచరణ ఏంటి?