రాజ్యసభ సభ్యత్వానికి ఆర్‌.కృష్ణయ్య రాజీనామా.. తదుపరి కార్యాచరణ ఏంటి?

వైసీపీ నుంచి 2022లో ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు.

రాజ్యసభ సభ్యత్వానికి ఆర్‌.కృష్ణయ్య రాజీనామా.. తదుపరి కార్యాచరణ ఏంటి?

Updated On : September 24, 2024 / 7:02 PM IST

రాజ్యసభ సభ్యత్వానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్‌.కృష్ణయ్య రాజీనామా చేశారు. నిన్న ఆర్.కృష్ణయ్య రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు పంపగా, దాన్ని ఛైర్మన్‌ ఆమోదించారు. వైసీపీ నుంచి 2022లో ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు.

తన పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉండగానే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్‌రావుతో పాటు మోపిదేవి వెంకటరమణ కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

బీసీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకే రాజీనామా చేసినట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని విస్తరించడంపై ఆర్.కృష్ణయ్య దృష్టిపెట్టారు.

కాగా, ఆర్.కృష్ణయ్య త్వరలోనే బీజేపీలో చేరతారని ఇటీవల ప్రచారం జరిగింది. తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకును మరింత పెంచుకునే దిశగా బీజేపీ దృష్టి సారించింది. దీంతో ఆర్.కృష్ణయ్యతో బీజేపీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

బీజేపీలో ఆర్.కృష్ణయ్యకు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఆర్‌ఎస్ఎస్‌లోనూ కృష్ణయ్య పనిచేశారు. కాగా, కృష్ణయ్య 2014 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగానూ ఎల్బీనగర్‌ నుంచి గెలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనను టీడీపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.

Naga Babu : వాళ్లు చేసిన పాపాన్ని ప‌వ‌న్ క‌డిగేస్తున్నారు.. నాగ‌బాబు ట్వీట్ వైర‌ల్‌..