CEC Report : ధర్మపురి స్ట్రాంగ్ రూమ్.. కేంద్ర ఎన్నికల బృందం హైకోర్టుకు నివేదిక
స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు మాయంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హై కోర్టు ఆదేశించింది.

Dharmapuri strong room (1)
Dharmapuri Strong Room : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ పై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల కేంద్ర ఎన్నికల బృందం హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. 2018 ఎన్నికలకు సంబంధించిన ఫైళ్లను, ఈవీఎంలను భద్రపరచడంలో విధాన పరమైన లోపాలు ఉన్నాయని తెలిపింది. అప్పటి రిటర్నింగ్ అధికారి భిక్షపతి, డిప్యూటీ ఎన్నికల అధికారి రాజేశం, కలెక్టర్ శరత్ ఎన్నికల సంఘం సూచించిన విధానాలు అనుసరించలేదని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు మాయంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హై కోర్టు ఆదేశించింది. స్ట్రాంగ్ రూమ్ లకి రెండు తాళాలు వేయాలని 2018 నవంబర్ 13న ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను జిల్లా ఎన్నికల అధికారులు అమలు చేయలేదు.
ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇక మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.