Minister Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు.. కవిత అరెస్టు విషయంపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆధారాలతో సహా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రినే సీబీఐ అరెస్ట్ చేసింది, కవిత పెద్ద విషయం కాదు అని కిషన్ రెడ్డి అన్నారు.

Minister Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు.. కవిత అరెస్టు విషయంపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Minister Kishan Reddy

Updated On : May 21, 2023 / 3:06 PM IST

Minister Kishan Reddy: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు విషయంపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న వార్తలు బేస్‌లెస్ అన్నారు. మేమంతా ఒక కుటుంబం. మా జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవటం సహజం అని కిషన్ రెడ్డి చెప్పారు. కవిత అరెస్ట్ విషయంపై మాట్లాడుతూ.. ఆ అంశం మా చేతుల్లో లేదు. సీబీఐ పరిధిలోని అంశం. ఆధారాలతో సహా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రినే సీబీఐ అరెస్ట్ చేసింది, కవిత పెద్ద విషయం కాదు అని కిషన్ రెడ్డి అన్నారు.

Minister Kishan Reddy: పోస్టర్లు వేసినంత మాత్రాన దేశ్‌కీ నేత కారు.. రైతుబంధు కంటే.. మేమిచ్చే ఎరువుల సబ్సిడీ ఎక్కువ

అవినీతికి పాల్పడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేనుసైతం జైలుకు పంపించామని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ను ఎంఐఎం ‌పార్టీ నడిపిస్తోందని, మహారాష్ట్రలో ఒక వార్డ్ మెంబర్ గెలిచినందుకే సంబుర పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణను అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారు. నోట్ల రద్దులో మా ప్లాన్ మాకు ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. కర్ణాటక ఎన్నికల‌ ప్రభావం తెలంగాణలో ఉండదని, కాంగ్రెస్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదుని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని అన్నారు.

Opposition Parties Unity : విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు.. కేజ్రీవాల్ ని కలిసిన నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్

G20 సమావేశాల్లో భాగంగా 22, 23, 24 తేదీలో కల్చర్, టూరిజం డెలిగేట్స్ మీటింగ్ శ్రీనగర్‌లో జరుగుతుందని, 36 సంవత్సరాల తరువాత శ్రీనగర్‌లో అంతర్జాతీయ స్థాయి మీటింగ్ జరుగుతుందని కిషన్ రెడ్డి చెప్పారు.  కర్ణాటక పూర్తి స్థాయి మెజార్టీ ఇస్తే ముఖ్యమంత్రి ఎన్నుకోవడానికి మూడు చెరువుల నీళ్లు తాగారని కాంగ్రెస్ పార్టీనుద్దేశించి ఎద్దేవా చేశారు.