Banda Prakash : తెలంగాణ ఉద్యమంలో వీరోచిత పోరాటం చేసిన చాకలి ఐలమ్మ : బండ ప్రకాష్
ఆనాటి నుండి ఆమె పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదన్నారు. అందుకే తెలంగాణ వచ్చాక ఆమెను గుర్తుచేసుకుంటూ అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

Council Deputy Chairman Banda Prakash
Banda Prakash – Chakali Ailamma Jayanthi : తెలంగాణ ఉద్యమంలో ఐలమ్మ వీరోచిత పోరాటం చేశారని శాసన మండలి డిప్యూటీ ఛైర్మెన్ బండ ప్రకాష్ కొనియాడారు. తెలంగాణ పోరాటంలో ఆమె పాత్ర ఎంతో గొప్పదన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మంగళవారం అసెంబ్లీ హాల్ లో ఐలమ్మ చిత్రపటానికి మండలి డిప్యూటీ ఛైర్మెన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ కవిత నివాళులు అర్పించారు. అనంతరం బండ ప్రకాష్ మాట్లాడారు. ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో ఐలమ్మ పాత్ర ఎంతో గొప్పదన్నారు. ఆనాడు ఐలమ్మ వీరోచిత పోరాటం చేశారని తెలిపారు. ఆనాటి నుండి ఆమె పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదన్నారు. అందుకే తెలంగాణ వచ్చాక ఆమెను గుర్తుచేసుకుంటూ అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకి నివాళులు అర్పిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
ఇన్నాళ్లు విధానాలు మాత్రమే ఉండే కానీ, ఇప్పుడు ఆమె విధానాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసైపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటేడ్ కోటా ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడంపై మండిపడ్డారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ నుంచి ప్రకటన వెలువడిందన్నారు. రాజ్యాంగ బద్దంగా ఉన్న పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలు చేయడం సరికాదన్నారు.
గొప్ప ప్రజాస్వామిక దేశంగా ఎదిగే సందర్భంలో ఇలాంటి నిర్ణయాలు మంచివి కావని హితవు పలికారు. ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తిరస్కరించడంపై దుమారం రేగుతోంది. గవర్నర్ తమిళిసైపై బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.