Water Bicycle: అమెరికా శపథాన్ని నెరవేర్చిన కొండా.. చేవెళ్ల యువతతో అద్భుతం ఆవిష్కరణ

రెండేళ్ల క్రితం ఈ సైకిల్ అమెరికాలో చూశాను. ఇప్పుడు చూపిస్తున్న వీడియో చేవెళ్లకు చెందినది. చేవెళ్ల యువత ఈ సైకిల్ తయారు చేశారు. దానికి నా తరపు నుంచి చిన్న సహాయం చేశాను

Water Bicycle: అమెరికా శపథాన్ని నెరవేర్చిన కొండా.. చేవెళ్ల యువతతో అద్భుతం ఆవిష్కరణ

Konda Vishweshar Reddy: మనసు ఉండాలే కానీ ఏదైనా సాధించొచ్చు, ఏమైనా చేయొచ్చు అంటారు. అదే మనసు ఉండాలి కానీ, పదవులు, ప్రభుత్వాలు చేయలేని పనులు కూడా చేస్తారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అలాంటి ఒక అద్భుత ఆవిష్కరణకు మూలం అయ్యారు. తాను రెండేళ్ల క్రితం అమెరికాలో చూసి తిరిగిన వాటర్ బైకును ఇండియాలో ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అంతే.. చేవెళ్ల యువతకు కావాల్సిన ప్రోత్సాహం, సహాయం అందించి, వారి చేతే ఆ వాటర్ బైకును రూపొందించారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లినప్పుడు ఒక సరస్సులో వాటర్ బైకు తోలారు కొండా. అది ఆయనకుర బాగా నచ్చిందట. ఆ వీడియోను అప్పట్లోనే తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాదు, అప్పట్లోనే దీన్ని తొందరలోనే ఇండియాలో నిజం చేసి చూపిస్తానని శపథం చేశారు కూడా. అనుకున్నట్లుగానే రెండేళ్లలో చేసి చూపించారు.


తాజాగా అది నిజం చేశారు. తన సొంత నియోజకవర్గం చేవెళ్ల యువత చేత దీన్ని ఆవిష్కరింపజేశారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘రెండేళ్ల క్రితం ఈ సైకిల్ అమెరికాలో చూశాను. ఇప్పుడు చూపిస్తున్న వీడియో చేవెళ్లకు చెందినది. చేవెళ్ల యువత ఈ సైకిల్ తయారు చేశారు. దానికి నా తరపు నుంచి చిన్న సహాయం చేశాను’’ అని పోస్ట్ చేశారు. ప్రభుత్వాలు కూడా మరింత చొరవ తీసుకుని యువతను ప్రోత్సహిస్తే ఇలాంటివి ఎన్ని ఆవిష్కరణకు వస్తాయో కదా.