Telangana Polls: తెలంగాణ ఎన్నికలపై కీలక విషయాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి

ఎన్నికల కోసం సుమారు 2.5 లక్షల సిబ్బందిని మోహరించారు. ఇందులో 45వేల మంది తెలంగాణ పోలీసులు, ఇతర రాష్ట్రాల నుంచి హోం గార్డ్స్ విధుల్లోకి వస్తారు.

Telangana Polls: తెలంగాణ ఎన్నికలపై కీలక విషయాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఈవీఎం కమిషనింగ్ మొత్తం పూర్తి అయిందని, ఈవీఎంల పంపిణీకి సిద్ధంగా ఉన్నామని ఆయన కార్యాలయం ఆదివారం పేర్కొంది. హోం ఓటింగ్ పూర్తి అయిందని తెలిపారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ లు 1లక్ష 65వేలు ఆమోదం పొందగా, ఇప్పటి వరకు 95వేల ఓటింగ్ జరిగిందని తెలిపారు. ఇందులో ఫెసిలిటేషన్ సెంటర్లలో 1లక్ష 31మంది, పోలీసులు 35వేల మంది, నాన్ గవర్నమెంట్ 1వెయ్యికి పైగా ఉన్నారు. హోం ఓటింగ్ ద్వారా 26వేలు ఓటింగ్ పూర్తి చేసుకున్నారు.

ఈపీఐసీ ప్రింటింగ్ 54లక్షల 13వేలు పూర్తి అయిందని, దీని పంపిణి జరుగుతున్నాయని సీఈవో కార్యాలయం తెలిపింది. ఈపీఐసీ కార్డులు బీఎల్ఓ ద్వారా పంపిణి జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం అభ్యర్థులు 2290 ఉండగా.. ఇందులో 221 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 49 కౌంటింగ్ కేంద్రలుండగా 31 జిల్లాల్లో ఒక్కో కౌంటింగ్ కేంద్రం, రంగారెడ్డిలో 4, హైదరాబాదులో 14 ఉన్నాయి.

ఇది కూడా చదవండి: రాజస్థాన్‭లో అలా జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీనే గెలిచింది.. నిన్నటి ఎన్నికల్లో మళ్లీ అదే జరిగింది

ఎన్నికల కోసం సుమారు 2.5 లక్షల సిబ్బందిని మోహరించారు. ఇందులో 45వేల మంది తెలంగాణ పోలీసులు, ఇతర రాష్ట్రాల నుంచి హోం గార్డ్స్ విధుల్లోకి వస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్, ఒక అటెండర్ ఉంటారు. మొత్తం 80వేల వీల్ చైర్లను జిల్లాలకు పంపినట్లు తెలిపారు. మొత్తం 373 కేంద్ర బలగాలు ఈ ఓటింగును పర్యవేక్షించనున్నాయి. 24 వేల హోం గార్డులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. 72, 48గంటల ముందు కటినమైన నిబంధనలు అమలులో ఉంటాయి.

48 గంటల నుంచే 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 48 గంటల ముందే స్థానికేతరులు బయటకు వెళ్లిపోవాలి. సైలెంట్ పీరియడ్ లో టీవీ, సోషల్ మీడియా ప్రకటనలకు అనుమతి లేదు. ఈ రోజు వరకు 709కోట్ల రూపాయల సొమ్ము సీజ్ చేశారు. 290 కోట్ల రూపాయల వరకు నగదు ఉంది. ఎంసీసీలో 1025 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. 120 లింక్స్ ఫిర్యాదులు వచ్చాయి, వాటిని డీల్ చేసినట్లు సీఈవో కార్యాలయం పేర్కొంది. సువిధ యాప్ ద్వారా 41వేల అనుమతులు ఇచ్చామని, 7626 ఫిర్యాదులు C – విజిల్ ద్వారా వచ్చాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ 3 గంటల కరెంంట్ కావాలా? బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ కావాలా? : కవిత

కాల్ సెంటర్ కు 44,282 జిల్లాలో, స్టేట్ లెవల్ 2,500 కాల్స్ వచ్చాయి. కాల్ సెంటర్లలో 500 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. 12వేల క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ను పకడ్బందీ గా ఉండేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు ాము సిద్ధంగా ఉన్నామని తెలిపిన సీఈవో కార్యాలయం.. కేటీఆర్ కు ఇచ్చిన నోటిసులకు వివరణ ఇంకా ఇవ్వలేదని పేర్కొంది.