Nalgonda : కుప్పకూలిన చాపర్.. తమిళనాడు మ‌హిళా ట్రైనీ పైల‌ట్ మృతి

రెవెన్యూ, వైద్య యంత్రాంగం కూడా ఘ‌ట‌నాస్థలికి చేరుకుని .. ప్రమాదానికి గ‌ల కార‌ణాల‌ను దర్యాప్తు చేస్తున్నారు. ఇక శిక్షణ చాపర్‌ కూలిన విష‌యాన్ని ఎయిర్‌ఫోర్స్ అధికారుల‌కు స‌మాచారం...

Nalgonda : కుప్పకూలిన చాపర్.. తమిళనాడు మ‌హిళా ట్రైనీ పైల‌ట్ మృతి

Nalgonda

Updated On : February 26, 2022 / 3:20 PM IST

Chopper Crash in Nalgonda : న‌ల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం జ‌రిగింది. పెద్దవూర మండ‌లం రామ‌న్నగూడెం తండా వ‌ద్ద చాప‌ర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైల‌ట్‌తో పాటు మ‌హిళా ట్రైనీ పైల‌ట్ మ‌హిమ‌ మృతి చెందారు. మ‌హిమ త‌మిళ‌నాడుకు చెందిన యువ‌తిగా గుర్తించారు. మ‌రో పైల‌ట్ వివ‌రాలు తెలియాల్సి ఉంది. అటు చాపర్‌ కుప్పకూలిన వెంటనే .. పైల‌ట్ల శ‌రీర భాగాలు తునాతున‌క‌లుగా ప‌డిపోయాయి. శ‌రీర భాగాలు ముద్దలు ముద్దలుగా, గుర్తు ప‌ట్టలేని స్థితిలో ఉన్నాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్పికి తరలించారు.

Read More : Helicopter accident: నల్గొండ జిల్లాలో చాపర్ ప్రమాదం

రెవెన్యూ, వైద్య యంత్రాంగం కూడా ఘ‌ట‌నాస్థలికి చేరుకుని .. ప్రమాదానికి గ‌ల కార‌ణాల‌ను దర్యాప్తు చేస్తున్నారు. ఇక శిక్షణ చాపర్‌ కూలిన విష‌యాన్ని ఎయిర్‌ఫోర్స్ అధికారుల‌కు స‌మాచారం అందించారు. అటు ప్రమాదానికి గురైన చాప‌ర్‌ను మాచర్ల మండలం నాగార్జున సాగర్ విజయపురిసౌత్‌లో ఉన్న .. ఫ్లైటెక్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌గా .. పోలీసులు గుర్తించారు. ఉదయం 10గంటల 50 నిమిషాలకు చాపర్‌ కుప్పకూలినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. దగ్గర్లో విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్లకు చాపర్‌ డీకొట్టి కుప్పకూలినట్లు .. స్థానిక రైతులు, కూలీలు తెలిపారు. చాప‌ర్ కూలిన స‌మ‌యంలో.. భారీ శ‌బ్దం వినిపించింద‌ంటున్నారు. ఆసమయంలో ద‌ట్టమైన మంట‌లు, పొగ‌లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. చాపర్‌ కూలిన వెంట‌నే అక్కడికి చేరుకుని పోలీసుల‌కు స‌మాచారం అందించామ‌ంటున్నారు.