New Year Greetings : తెలంగాణ ప్రజలకు సీఏం కేసీఆర్, గవర్నర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. 2022 లో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ముఖ్యమంత్రి  కే

New Year Greetings : తెలంగాణ ప్రజలకు సీఏం కేసీఆర్, గవర్నర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

New Year Greetings

Updated On : January 1, 2022 / 7:28 AM IST

New Year Greetings :  తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. 2022 లో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆకాంక్షించారు.

నూతన సంవత్సరంలో కష్టాలను  అధిగమిస్తూ సుపరిపాలనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అకుంఠిత  దీక్షతో ముందుకు సాగుతామని చెప్పారు.  ఏటేటా వినూత్న పంథాలో అభివృధ్ది, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ సబ్బండ వర్ణాలు ప్రగతి ప్రదాన పురోగమించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కోన్నారు.

ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పలువురు మంత్రులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు,