CM KCR Birthday Celebrations: సీఎం కేసీఆర్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫోన్
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు.

CM KCR
CM KCR Birthday Celebrations: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలతో పాటు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
LIVE NEWS & UPDATES
-
కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ తో రాజకీయంగా కలిసి పని చేశానని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో రాష్ట్రానికి సేవలందించాలని అన్నారు. కేసీఆర్ ఆలోచనలకు, ప్రకటనలకు కార్యరూపం ఇవ్వాలని చెప్పారు. అప్పుడే దాని ఫలితం సమాజం పొందడానికి వీలుంటుందని అన్నారు.
-
కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు: జగన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీపై ఎల్లప్పుడూ భగవంతుని దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో చిరకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని జగన్ ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీపై ఎల్లప్పుడూ భగవంతుని దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో చిరకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.@TelanganaCMO pic.twitter.com/0RXql8AOG4
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2023
-
కేసీఆర్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫోన్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి సీఎం కేసీఆర్ తో ఆమె ఫోన్ లో మాట్లాడారు. కేసీఆర్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ముర్ము ఆకాంక్షించారు.
-
కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి ..
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను జనగామ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ బర్త్ డే వేడుకల కేక్ కట్ చేశారు.
Minister Errabelli cutting the cake at CM KCR's birthday celebrations
-
అనాధాశ్రమంలో విద్యార్థులకు పండ్లు, దుస్తులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఏనుగొండ అనాధాశ్రమంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి హాజరై విద్యార్థులకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. అదేవిధంగా మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మంత్రి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
https://twitter.com/VSrinivasGoud/status/1626471423345823745?cxt=HHwWgsDQnYzJsZItAAAA
-
సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పువ్వాడ అజయ్
https://twitter.com/puvvada_ajay/status/1626413171937529856?cxt=HHwWgMDStbWKl5ItAAAA
-
జోగులాంబ గద్వాల జిల్లాలో ..
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ 69వ జన్మదినం సందర్బంగా కేక్ కట్ చేసి, రక్తదానం శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
-
సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావు ..
ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ పుట్టినరోజు సందర్భంగా.. సిద్దిపేట పట్టణంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కేక్ కట్ చేశారు.
-
సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హరీష్‌రావు ..
సీఎం కేసీఆర్‌కు మంత్రి తన్నీరు హరీష్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అంటే కారణజన్ముడుగా.. చిరస్మరణీయుడుగా ప్రజల తల రాతలను మార్చే మహనీయుడుగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అంటూ ఆకాంక్షించారు.
https://twitter.com/BRSHarish/status/1626427717146259458?cxt=HHwWhMDR1YfZnZItAAAA
-
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు ..
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
https://twitter.com/RaoKavitha/status/1626472232812785664?cxt=HHwWgMC9nZv4sZItAAAA
-
70కేజీల భారీ కేక్ కట్ చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి
సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 70 కేజీల భారీ కేక్‌ను మంత్రి కట్ చేశారు. అంతకుముందు కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని కోరుకుంటూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
Minister Jagadishwar Reddy cutting the cake at CM KCR's birthday celebrations
-
కేసీఆర్‌కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్ ..
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
https://twitter.com/bandisanjay_bjp/status/1626441870128676865?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1626441870128676865%7Ctwgr%5E0e71fd6834200929adbaad6a16a4b9fdb2bccd6f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftelangana%2Fcm-k-chandrasekhar-rao-birthday-celebrations-live-updates-from-telangana-and-ap-politicians-and-tollywood-movie-celebrities-wishes-latest-news-au79-891633.html
-
కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
https://twitter.com/narendramodi/status/1626423657986940928?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1626423657986940928%7Ctwgr%5E553301a2a7cdb1a3b927df5d6a2fd97313ab4f6a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftelangana%2Fcm-k-chandrasekhar-rao-birthday-celebrations-live-updates-from-telangana-and-ap-politicians-and-tollywood-movie-celebrities-wishes-latest-news-au79-891633.html
-
కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ..
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
https://twitter.com/ncbn/status/1626455712179290112?cxt=HHwWgIDQ9cq2qpItAAAA
-
సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్ తమిళిసై సౌందర రాజన్
https://twitter.com/DrTamilisaiGuv/status/1626415131168243718?cxt=HHwWjIDU6br8l5ItAAAA